‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ రివ్యూ

RaRandoi-Veduka-Chuddam-Telugu-Movie-Review-Rating

సినిమా : రారండోయ్ వేడుక చూద్దాం
న‌టీన‌టులు : నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, వెన్నెల కిశోర్
మ్యూజిక్ : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత : నాగార్జున అక్కినేని

ఫ్యామిలీ సినిమాల‌తో విజ‌యాలు రుచిచూసిన అక్కినేని నాగ‌చైత‌న్య మ‌ళ్లీ అలాంటి మువీనే ఎంచుకున్నాడు. ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాంతో ఈ సినిమా మీద అక్కినేని చైతూ ఫ్యాన్స్ చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్, ర‌కుల్ ప్రీత్ కూడా తోడు కావ‌డంతో సినిమా ఓపెనింగ్స్ బాగా క‌నిపించాయి. మ‌రి సినిమా దానికి త‌గ్గ‌ట్టుగా ఉందా…చైతూ ఆశ‌లు పండించిందా.ఈ రివ్యూలో చూద్దాం

స్టోరీ:

భ్రమరాంబ.. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన పల్లెటూరి అమ్మాయి. గారాబంగా పెరిగిన భ్రమరాంబకు తండ్రి (సంపత్ ) అంటే ఎంతో ఇష్టం. తను అనుకున్నది ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేయటం భ్రమరాంబకు అలవాటు. ఒకసారి తన కజిన్ పెళ్లిలో భ్రమరాంబను చూసిన శివ (నాగచైతన్య) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తరువాత భ్రమరాంబ కూడా ఉన్నత చదువుల కోసం వైజాగ్ రావటంతో ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎప్పుడైతే తనని ప్రేమిస్తావో అప్పుడు నీకు దూరంగా వెళ్లిపోతానన్న కండిషన్తో శివతో స్నేహం చేస్తుంది భ్రమరాంబ. కానీ తరువాత శివ తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతనికి దూరమవుతుంది. అలా దూరమైన శివ, భ్రమరాంబ తిరిగి ఎలా కలిశారు..? వారిద్దరి కుటుంబాల మధ్య ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
ర‌కుల్ గ్లామ‌ర్ రోల్
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
ఫస్ట్ హాఫ్

నటీనటులు :
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో త‌ర్వాత నాగ చైత‌న్య మ‌రోసారి కుటుంబ క‌థా చిత్రంతో ఆక‌ట్టుకున్నాడు. న‌ట‌న ప‌రంగా చైతూ ఫ‌ర్వాలేద‌నిపించాడు. సెంటిమెంట్ సీన్స్ లో కొంత ప‌రిణ‌తి క‌నిపించింది. కానీ ప్రేక్ష‌కులు ఆశించిన స్థాయిలో లేదు. ఇక ర‌కుల్ ప్రీత్ మ‌రోసారి త‌న హ‌వా చాటుకుంది. ప‌ల్లెటూరి అమ్మాయి క్యారెక్ట‌ర్ లో మెప్పించింది ఇక జ‌గ‌ప‌తిబాబుకి తండ్రి పాత్ర కొట్టిన పిండి అన్న‌ట్టుగా మారింది. సంప‌త్, వెన్నెల కిషోర్ వంటి వాళ్లు కూడా ఫ‌ర్వాలేద‌నిపించారు.

టెక్నిక‌ల్ టీమ్ :
హైప్ క్రియేట్ చేసినా ఆశించిన స్థాయిలో సినిమా రూపొందించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. మంచి హిట్ త‌ర్వాత క‌ళ్యాణ్ కృష్ణ ఆశించిన సినిమాగా క‌నిపించ‌డం లేదు. ఫ‌స్టాఫ్ ఆస‌క్తిని రేకెత్తించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు.. విజువల్గా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఎనాలిసిస్

మొత్తంగా సినిమా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో నిరాశ క‌లిగిస్తుంది. ఫ‌స్టాఫ్ బోరింగ్ అనిపించ‌డంతో సెకండాఫ్ లో క‌థ‌ను ఆస‌క్తిగా మ‌ల‌చ‌లేక‌పోవ‌డంతో సినిమా ఫెయిల్యూర్ జాబితాలో చేరిపోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

updateap రేటింగ్: 1.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter