జ‌గ‌న్ దృష్టి మారింది..!

YS Jaganmohan Reddy

గ‌డిచిన ఎన్నిక‌ల ఫ‌లితాల నుంచి పాఠాలు నేర్చుకున్న వైఎస్ జ‌గ‌న్ ఈసారి దానికి త‌గ్గ‌ట్టుగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ముంద‌స్తు స‌న్నాహాలు ప్రారంభించారు. గ‌తంలో చివ‌రి నిమిషంలో తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు బూమ‌రాంగ్ కావ‌డంతో ఆశ‌లు నీరుగారిన నేప‌థ్యంలో ఈసారి ముంద‌స్తు చ‌ర్య‌లకు సిద్ధ‌మ‌య్యారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహ‌క‌ర్త‌లు రంగంలో దిగిన నేప‌థ్యంలో జ‌గ‌న్ శిబిరంలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. పార్టీలో చేరిక‌లు కూడా షురూ కావ‌డంతో మ‌రింత సంద‌డి క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో పాద‌యాత్ర‌కు సిద్ధం కావాల్సిన నేప‌థ్యంలో ముందుగానే పార్టీ నిర్మాణం, నేత‌ల చేరిక వంటి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే నియోజ‌వ‌క‌ర్గాల వారీగా ప్లీన‌రీ స‌మావేశాలు నిర్వ‌హించారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో స‌ర్కారు సొమ్ముతో చంద్ర‌బాబు న‌వ‌నిర్మాణ దీక్ష‌లు న‌డిపిన‌ప్ప‌టికీ విప‌క్ష స‌భ‌లు మాత్రం ప‌లు చోట్ల విజ‌య‌వంత‌మ‌య్యాయి. పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌లో కూడా స్పంద‌న బాగుంద‌ని రిపోర్టులు అందుతున్నాయి. దాంతో వ‌చ్చే నెల‌లో రాష్ట్ర ప్లీన‌రీ కోసం గుంటూరులో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఆత‌ర్వాత స‌భ్య‌త్వం, క‌మిటీల ఏర్పాటు కోసం పిలుపునివ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. చాలాచోట్ల పార్టీకి క‌నీసం స‌మ‌న్వ‌యం చేసే నాయ‌కుడు కూడా లేక‌పోవ‌డంతో బ‌ల‌హీనంగా క‌నిపిస్తున్నామ‌ని, క్యాడ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ నాయ‌క‌త్వ కొర‌త వేధిస్తోంద‌ని వైసీపీ అధిష్టానం అంచ‌నా వేస్తోంది. దాంతో ఇప్పుడు ప్లీన‌రీ సంద‌ర్భంగా పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించాల‌నుకుంటున్న‌ట్టు చెబుతున్నారు.

స‌భ్య‌త్వం, దిగువ స్థాయి క‌మిటీలు, ఆత‌ర్వాత జిల్లా క‌మిటీల పున‌ర్నిర్మాణం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు పార్టీ నేత‌లు చెబుతున్నారు. క‌మిటీల ఏర్పాటు త‌ర్వాత అనుబంధ సంఘాల వ్య‌వ‌హారం మీద కూడా లోట‌స్ పాండ్ పెద్ద‌లు కేంద్రీక‌రించ‌బోతున్నారు ఓవైపు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ విధానాల మీద ఉద్య‌మాలు నిర్వ‌హిస్తూనే, మ‌రోవైపు పార్టీ, అనుబంధ సంఘాల‌ను స‌న్న‌ద్ధం చేయాల‌ని ఆలోచిస్తోంది. కీల‌క‌మైన సంఘాలు కూడా నాయ‌క‌త్వం లోపంతో కొట్టిమిట్టాడుతున్నాయి. క‌నీసం కూడా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డానికి సిద్ధం కావ‌డం లేదు. దాంతో ఆ వ్య‌వ‌హారం మీద కూడా దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రం ఆపార్టీ ముందు క‌నిపిస్తోంది. ఇలాంటి నిర్మాణ స‌మ‌స్య‌ల‌న్నింటి మీద ప్లీన‌రీ నాటికి ఓ ప్ర‌ణాళిక రూపొందించే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం.

అమ‌రావ‌తిలో పార్టీ కార్యాల‌యం అంశం కూడా ముందుకొచ్చిన‌ప్ప‌టికీ అది మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జ‌గ‌న్ ఈలోగా తాత్కాలిక కార్యాల‌యం ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్టు చెబుతున్నారు. పాద‌యాత్ర చేప‌ట్టే ప‌రిస్థితి వ‌స్తే అది ముగిసిన త‌ర్వాతే కార్యాల‌యం ఏర్పాటు అంశం ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఏమైనా ఇప్ప‌టి వ‌ర‌కూ అధికార ప‌క్షం వైప‌ల్యాల మీద మాత్ర‌మే ఆలోచించిన వైసీపీ ఇప్పుడిప్పుడే సొంత ఇంటి స‌మ‌స్య‌ల మీద కూడా క‌న్నేయ‌డం విశేష‌మే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter