రివ్యూ 2016: జ‌గ‌న్ గ్రాఫ్ పెరిగిందా?

ys jagan

విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ప‌నితీరు మీద రాజ‌కీయ వ‌ర్గాల్లో సందేహాలు, ఆయ‌న వ్య‌వ‌హారం మీద సామాన్య ప్ర‌జ‌ల్లో అపోహ‌ల‌తో మొద‌లైన 2016లో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికింది. ఈ ఏడాదిలో జ‌గ‌న్ త‌న ప‌నితీరును దాదాపుగా మార్చుకున్నారు. క‌లుపుగోరుత‌నం కొత్త‌గా వచ్చింది. పార్టీ నేత‌ల‌కు ప్రాధాన్య‌త పెరిగింది. అంద‌రూ చెప్పేవి విన‌డం అల‌వాట‌య్యింది. ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ లో ఈ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన మార్పును చూసి ఆ పార్టీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోయేటంత స్థాయిలో క‌నిపించింది.

ఇక రాజ‌కీయంగా చూస్తే ఈ ఏడాది విప‌క్షం 21 మంది ఎమ్మెల్యేల‌ను న‌ష్ట‌పోవ‌డం ప్ర‌ధాన లోటు. బుజ్జ‌గించినా ప‌లువురు నేత‌లు జ‌గ‌న్ మాట దాటిపోవ‌డం వైఎస్సార్సీపీకి ఓ బ‌ల‌హీన‌త‌. అయితే పార్టీ మారిన నేత‌ల్లో స‌గానికి పైగా ఎమ్మెల్యేలు ఇప్ప‌టికీ జ‌గ‌న్ ని ఒక్క మాట కూడా అన‌క‌పోవ‌డ‌డం విశేషం. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి స‌హా ఇత‌ర కార‌ణాలు చెబుతూ సైకిలెక్కేసిన వారు పాత బాస్ ను ప‌ల్లెత్తు మాట కూడా అన‌లేదు. ఎమ్మెల్యేలు మారిపోయిన‌ప్ప‌టికీ పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంలో కూడా జ‌గ‌న్ దృష్టిపెట్ట‌లేదు. ఇప్ప‌టికీ ఆ పార్టీకి పూర్తిస్థాయి నిర్మాణం లేక‌పోవ‌డం , 2016 కూడా దానికి స‌మాధానం చెప్ప‌లేక‌పోవ‌డం కీల‌క‌మైన బ్యాక్ డ్రాప్ గానే చెప్పాలి. ఇక ప‌ని పంపిణీలో కూడా పెద్ద లోపం క‌నిపిస్తోంది. ఈ ఏడాదిలో విజ‌య‌సాయి రెడ్డి ఎంపీగా ఎన్నిక‌యిన త‌ర్వాత కొంత మార్పు వ‌చ్చింది. పీఏసీ చైర్మ‌న్ హోదాలో పాణ్యం ఎమ్మెల్యే ప‌నితీరు పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతోంది. రోజా వాగ్దాటి కొన‌సాగింది. పార్థ‌సార‌ధి వంటి వారు విజ‌య‌వాడో ప్ర‌ధాన గొంతుగా మారారు. బొత్స రాజ‌కీయ వ్యూహాలు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. కానీ పార్టీ థింక్ ట్యాంక్ లో ఇప్ప‌టికీ ప‌లు విష‌యాల మీద స్ప‌ష్ట‌త ఉండ‌డం లేదు. కీల‌క స‌మ‌యాల్లో వేగంగా స్పందించ‌డంలో జ‌గ‌న్ శిబిరం వైప‌ల్యాలు ఈ ఏడాది బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇక విప‌క్ష నేత‌గా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ స్పందించిన తీరు కొన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంది. ప్ర‌త్యేక హోదా మీద ప‌లుమార్లు ఆందోళ‌న‌లు, ఆమ‌ర‌ణ దీక్ష‌, యువ‌భేరీ అంటూ రాష్ట్ర‌మంతా చుట్టి రావ‌డం పార్టీకి ఉప‌యోగ‌ప‌డింది. క‌రువు స‌మ‌స్య‌పై అనంత‌పురం, ప‌ల్నాడు ప్రాంతాల‌లో జ‌గ‌న్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌కు ఆద‌ర‌ణ ద‌క్కింది. పోల‌వ‌రం నిర్వాసితులు, బాక్సైట్ బాధితులు, దివీస్ నిర్వాసితులు, తుందుర్రు ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు ఫ‌లితాన్నిచ్చాయి. అసెంబ్లీలో కూడా గ‌డిచిన బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్బంగా వ‌రుస‌గ అవిశ్వాస తీర్మానాలు పెట్టి ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్ట‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. అయితే ఆ సంద‌ర్బంగా వ్యూహాం స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో కొంత స‌త‌మ‌త‌మ‌యిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు అధికార ప‌క్షాన్ని నిల‌దీయ‌డంలో జ‌గ‌న్ మంచి మార్కులు సాధించారు. అనంత‌రం రోజా స‌స్ఫెన్ష‌న్ ను పెద్ద ఇష్యూగా మార్చ‌డం, సుప్రీంకోర్ట్ వ‌ర‌కూ వెళ్లి, వ‌ర్షాకాల సమావేశాల‌లో హ‌ల్ చ‌ల్ చేయ‌డంలో వైఎస్సార్సీపీ దూకుడు క‌నిపించింది.

జ‌గ‌న్ కి వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది కేసుల వ్య‌వ‌హారం న‌త్త‌న‌డ‌క‌న సాగ‌డం ద్వారా రాజ‌కీయ ప‌రిణామాల‌ను తేట‌తెల్లం చేసింది. భ‌విష్య‌త్తులో జ‌గ‌న్ తో అవ‌స‌రాలున్న జాతీయ పార్టీలు పెద్ద‌గా జ‌గ‌న్ జోలికి రావ‌డానికి సిద్ధ‌ప‌డ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. త‌ద్వారా జ‌గ‌న్ కి ఉప‌శ‌మ‌నం ద‌క్కుతోంది. ఇక కేసుల నుంచి ఒక్కొక్క‌రిగా రిలీఫ్ వ‌స్తుండ‌డంతో జ‌గ‌న్ కి కూడా కేసుల ఇబ్బంది ఉండ‌ద‌నే సంకేతాలు 2016 ఇచ్చింది. ఒక‌నాట‌టి కాంగ్రెస్ మిత్రులంతా ఇప్పుడు ర‌క‌ర‌కాల రూపాల్లో స‌హాకారం అందిస్తుండ‌డం జ‌గ‌న్ కి క‌లిసొచ్చే అంశం. ఇక లెఫ్ట్ పార్టీల‌తో కొంత సాన్నిహిత్యం పెర‌గ‌డం, సామాజికంగా కాపుల్లో వ‌చ్చిన చీలిక ద్వారా ఓ సెక్ష‌న్ జ‌గ‌న్ ని బ‌ల‌ప‌రుస్తుండ‌డం కూడా మేలు చేసే అంశాలు. మొత్తంగా ఈ ఏడాదిలో జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తంగానూ, పార్టీ ప‌రంగానూ, వ్య‌వ‌హారంలోనూ మార్పు క‌నిపించింది. విప‌క్షానికి కొంత మేలు చేసే దిశ‌లో రాజ‌కీయ ప‌రిణామాలున్నాయి. ఒక రాజ‌కీయంగా కీల‌క‌మైన 2017లో ఎలాంటి మార్పులుంటాయో చూడాలి.

One comment on “రివ్యూ 2016: జ‌గ‌న్ గ్రాఫ్ పెరిగిందా?”

  1. Basavanagouda bellary

    Good for help every one ysrcp members and party leaders…. Thanks for manchu family…. Regards Basava bellary.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter