గంటా శ్రీనివాస‌రావు ఆస్తులు స్వాధీనం

ganta

ఏపీలో అధికార పార్టీలో ఒక్కో నేత‌ది ఒక్కో తీరు అనుకుంటే అంద‌రూ అదే రీతిలో ఉన్నారు. బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి ప్ర‌జ‌ల‌ను ముంచ‌డంలో సిద్ధ‌హ‌స్తుల్లా క‌నిపిస్తున్నారు. మొన్న రాయ‌పాటి, అత‌డికి ముందు సుజ‌నా ..తాజాగా గంటా శ్రీనివాస‌రావు ఆఖాతాలో చేరిపోయారు. ఒక‌టా…రెండా ఏకంగా 200 కోట్లు ఎగ‌నామం పెట్టేశారు. బ్యాంకు సొమ్ము మింగేసి చెల్లించ‌కుండా ఎగ్గొట్టేస్తున్నారు. సామాన్య జ‌నాల‌ను ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేసే బ్యాంకు అధికారులు నిమ్మకు నీరెత్తిన‌ట్టు చూసిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు స్పందించారు. గంటా శ్రీనివాస‌రావు ఆస్తులు జ‌ప్తు చేస్తూ ప్ర‌జ‌క‌ట‌న జారీ చేశారు.

గంటా శ్రీనివాస‌రావు కిచెందిన ప్ర‌త్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ పేరుతో ఇండియ‌న్ బ్యాంకులో 200 కోట్ల రూపాయ‌ల రుణం తీసుకున్నారు. వ‌డ్డీల‌తో క‌లిపితే అది చాలా పెద్ద‌మొత్త‌మే అవుతుంద‌ని స‌మాచారం.అ యితే వాటిని చెల్లించ‌కుండా మంత్రి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలో చేరుతూ చ‌క్రం తిప్పుతున్నారు. దాంతో చాలాకాలం పాటు స‌హ‌నంగా ఎదురుచూసిన బ్యాంకు సిబ్బంది ఎట్ట‌కేల‌కు ఆస్తుల జ‌ప్తునకు బ‌రిలో దిగారు. అక్టోబ‌ర్ 4నాడు నోటీసులు ఇచ్చినప్ప‌టికీ స్పందించ‌క‌పోవ‌డంతో గ‌డిచిన వారంలో జ‌ప్తు ప్ర‌క్రియ పూర్తిచేసేశారు. అప్పున‌కు హామీదారుడిగా ఉన్న గంటా ఆస్తులు స‌హా ప‌లు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌త్యూష కంపెనీ డైరెక్ట‌ర్లు, అప్పులు హామీదారులంద‌రి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వారిలో గంటా కీల‌క అనుచ‌రుడు, భీమిలి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ ప‌రుచూరి భాస్క‌ర్ రావు ఆస్తులు కూడా ఉన్నాయి.

స్వాధీనం చేసుకున్న గంటా ఆస్తులు

1. బాల‌య్య శాస్త్రి లే అవుట్ లో స‌ర్వే నెంబ‌ర్ 20 లో 444 చ‌.గ భూమి
2. కూర్మ‌న్న‌పాలెంలో 13జ‌20,21,22 లో మొత్తం 1443 చ‌.గ భూమి
3. అన‌కాప‌ల్లి స‌మీపంలోని పూడిమ‌డ‌క జంక్ష‌న్ లో ఎన్ హెచ్ ను ఆనుకుని 0.66 ఎక‌రాల భూమి
4. చోడ‌వ‌రం మండ‌లం కొత్తూరు మెయిన్ రోడ్డులో 1355 చ‌.గ భూమి, నిర్మించిన ఆస్తి
5. ఎంవీపీ కాల‌నీలో గంటా పేరుతో ఉన్న హెచ్ఐజీ ప్లాట్ నెంబ‌ర్ 231 లో నివాస భ‌వ‌న ఆస్తి

ఇవి కాక భాస్క‌ర్ రావు పేరుతో ఉన్న ప‌లు విలువైన ఆస్తుల‌ను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. నిప్పులాంటి పాల‌న‌లో మంత్రులు, అనుచ‌రుల తీరు ఏ స్థాయిలో ఉందో ఈ వ్య‌వ‌హారం చాటుతోంది. ఓవైపు జ‌నం రెండు వేల రూపాయ‌ల నోటు కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల‌బ‌డి కుదేల‌వుతుంటే ఏకంగా 200 కోట్ల ఆస్తుల‌ను కాజేసి బ్యాంకుకి అప్పు చెల్లించ‌కుండా అధికార పార్టీ ఎమ్మెల్యే వ్య‌వ‌హారం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter