జ‌న‌సేన‌లో విబేధాలు

janasena

పార్టీ ఆవిర్భించి మూడేళ్లు నిండినా ఇప్ప‌టికీ ఆపార్టీకి క‌మిటీ గానీ, పూర్తిస్థాయి నిర్మాణ స‌న్నాహాలు గానీ క‌నిపించ‌డం లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్టు అధినేత ప్ర‌క‌టించ‌నా అందుకు తగ్గ‌ట్టుగా సంసిద్ధ‌త ఉందా అంటే సందేహ‌మే. ఇప్పుడిప్పుడే జ‌న‌సైనికుల ఎంపిక ప్ర‌క్రియ సాగుతున్న త‌రుణంలో ఎప్ప‌టికీ స్ప‌ష్ట‌త వ‌స్తుందోన‌నే అనుమానాలు క‌నిపిస్తున్నాయి. ఇక అధినేత కూడా ఈ మ‌ధ్య అంత చురుగ్గా క‌దులుతున్న‌ట్టు లేదు. గ‌తంలో ట్విట్ట‌ర్ సాయంతో హ‌ల్ చ‌ల్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ కాలంలో మాత్రం ఆ అకౌంట్ హ్యాక్ కావ‌డంతో ఆయ‌న పూర్తిగా మౌనంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో జ‌న‌సేన వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి.Cvip8opUkAAbF_z

ఆలోగా పార్టీ నేత మ‌ధ్య విబేధాలు పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్వాత పార్టీలో ఎవ‌రి పాత్ర ఏమిటనే దానిలో స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో కొంద‌రు పెత్త‌నం కోసం ప్ర‌య‌త్నం చేయ‌డం వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. దాంతో జ‌న‌సేన శిబిరంలో పెరుగుతున్న వైరం చివ‌ర‌కు ఒక వ‌ర్గం దూరం కావ‌డానికి కార‌ణంగా మారుతున్న‌ట్టు భావిస్తున్నారు. జ‌న‌సేన సొంతంగా జ‌నం మ‌ధ్య‌కు వ‌చ్చిన కార్య‌క్ర‌మాలు బ‌హిరంగ‌స‌భ‌లు మాత్ర‌మే. వాటి నిర్వ‌హ‌ణ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘ‌వ‌య్య‌ ఇటీవ‌ల పార్టీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దానికి త‌గ్గట్టుగానే ఆయ‌న సొంతంగా సినిమాకు శ్రీకారం చుట్ట‌డం విశేషం. మెగా హీరోయిన నిహారిక న‌యా సినిమాకి మారిశెట్టి రాఘ‌వ‌య్య‌ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కాకినాడ‌, అనంత‌పురం స‌హా అనేక స‌భ‌ల‌కు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, స‌భ‌ల స‌క్సెస్ కి కార‌ణ‌మైన రాఘ‌వ‌రావు హ‌ఠాత్తుగా రాజ‌కీయాల నుంచి మ‌ళ్ళీ సినిమాల వైపు దృష్టి సారించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. పార్టీ నేత‌గా ప్రచారం జ‌రిగిన త‌ర్వాత‌, కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా వెళ్లిన రాఘ‌వ‌య్య‌ ఇప్పుడు వెన‌క్కి వెళ్ల‌డానికి కార‌ణం ప‌వ‌న్ శిబిరంలో ఉన్న విబేధాలు కీల‌క‌మ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇక ఈ వ్య‌వ‌హారాల ఫలితంగానే చివ‌ర‌కు నాగేంద్ర‌బాబు క్యాంప్ లోకి రాఘ‌వ‌య్య‌ చేరి ఉంటార‌ని చెబుతున్నారు. చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏలూరు యాత్ర కూడా ఆగిపోయిన‌ట్టేనా అనే అనుమానాలు చుట్టుముడుతున్నాయి. గ‌తంలోనే ప‌వ‌న్ ప్ర‌క‌టించిన ఏలూరులో ఆయ‌న మకాం పెట్ట‌డానికి మూల కార‌ణం మారిశెట్టి రాఘ‌వ‌రావు అని ప్ర‌చారం సాగింది. ఇప్పుడు ఆయ‌న సినిమాల వైపు మ‌ళ్ల‌డంతో ప‌వ‌న్ ప‌య‌నం కూడా సందిగ్ధ‌మే అని చెబుతున్నారు. ఏమ‌యినా జ‌న‌సేన పార్టీకి ఇంకా రూపురేఖ‌లు లేక‌పోయినా వ‌ర్గ‌పోరు మాత్రం మొద‌లుకావ‌డం విశేషంగానే చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter