ఒక్క మ్యాచ్-వంద‌ల ప్ర‌శ్న‌లు

India-Vs-Pakistan-Final-Match-Prediction

అస‌లు ఇండియా- పాకిస్తాన్ ఫైన‌ల్ మ్యాచ్ కి రంగం సిద్ధం చేయ‌డ‌మే పెద్ద సందేహంగా చాలామంది భావించారు. అమిర్ సోహ‌యిల్ వంటి వారు వ్య‌క్తం చేసిన అనుమానాల‌కు స‌మాధాన‌మే క‌ష్టంగా ఉంది. ఇక అలాంటి స‌మ‌యంలో ఫైన‌ల్ టీమిండియా ఆట‌తీరు మ‌రిన్ని సందేహాలు క‌లిగించింది. ఇన్ ఫామ్ ఆట‌గాళ్ల వ్య‌వ‌హారం ఇంత పేల‌వంగా ఉంటుందా అని నోరెళ్ల‌బెట్టెలే చేసింది. ఆట‌లో ఫ‌లితం క‌న్నా ఆట‌తీరు అత్యంత ముఖ్యం. గెలుపోట‌ముల క‌న్నా పోరాడిన తీరు ప్ర‌ధానం. కానీ టీమిండియా చ‌రిత్ర‌లోనే అత్యంత పేల‌వంగా, ఇంకా చెప్పాలంటే 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో ఆసీస్ చేతిలో ఎదుర‌యిన ప‌రాభ‌వాన్ని మించిన ఓట‌మి చ‌విచూడ‌డం వెనుక ఛాంపియ‌న్స్ ట్రోఫీ పెద్ద గాంబ్లింగ్ టోర్నీనా అనే అనుమానం రాక‌మాన‌దు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఒక్క ఫైన‌ల్ మ్యాచ్ లోనే ఏకంగా 2వేల కోట్ల బెట్టింగ్ చేతులు మార‌డం ఇలాంటి స‌వాలక్ష సందేహాల‌కు తావిస్తోంది.

ఓ ఆట‌లో అయినా గెలుపోటములు సహజం. ఆ మాట‌కొస్తే క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే హాకీలో పాక్ ని టీమిండియా చిత్తు చేసింది. కాని ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్స్ లో దారుణమైన ఓటమి మీదే సందేహాలు కలుగుతున్నాయి. భువి తప్ప మిగతా బౌలర్లంతా ఎందుకు ఫెయిలయ్యారు. నోబ్ లు, వైడ్ లు విపరీతంగా వేయడంలో మరేదైనా అంతరార్థం ఉందా… 7 నుండి 8 పరుగులు ఓవర్ కు సమర్పించుకుంటున్న తరుణంలో కూడా బౌలింగ్ మార్పు సరిగా చేయకపోవడానికి కారణమేంటి. యువరాజ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ ని ఎందుకు ట్రై చేయలేదు. జాదవ్ కు పరిస్థితి చేయిదాటాక బౌలింగ్ ఇవ్వడానికి కారణమేంటి. పెద్ద టార్గెట్ ఉన్నప్పడు కనీసం రెండంకెల స్కోరు చేసేదాకైనా ఓపిక పట్టాలన్న ఇంగితం ఎందుకు కొరవడింది….. ఇలా చాలా సందేహాలు…. ఇవన్నీ యాదృచ్చికమా… ఐచ్చికమా….అనే అర్థం కాకుండా ఉంది. అభిమానుల వేధిస్తోంది.

నిజానికి క్రికెట్ కి ప్ర‌స్తుత త‌రంలో ఆద‌ర‌ణ త‌గ్గుతోంది. 80 ల త‌ర్వాత ఊపందుకున్న క్రికెట్ మోజు 2000వ‌ర‌కూ అప్ర‌తిహాతంగా సాగింది. ఆత‌ర్వాత క్రమంగా త‌గ్గుతుండ‌గా ఐపీఎల్ పుణ్యాన మ‌రింత వేగంగా ఆవిర‌వుతోంది. ఆ స్థానంలో క‌బ‌డ్డీ, బ్యాడ్మింట‌న్ వంటి ప‌లు క్రీడ‌లు వ‌చ్చి చేరుతున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఫ‌లితాలు చూసిన స‌గ‌టు అభిమానాలు పూర్తిగా క్రికెట్ ను విస్మ‌రించే ప్ర‌మాదం లేక‌పోలేదు. బెట్టింగ్ రాయుళ్ల‌కు అత్యంత అనువైన ఆట‌గా ఉంది కాబ‌ట్టి క్రికెట్ ప్ర‌స్తుతం మ‌నుగ‌డ‌లో ఉంది. లేకుండా మ‌న‌లాంటి అతి కొద్ది దేశాల‌కే ప‌రిమిత‌మైన ఈ క్రీడ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోవ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి తెర‌వెనుక వ్య‌వ‌హారాలు పెద్ద‌స్థాయిలో పెరుగుతున్నాయ‌ని అబిమానులు అంచ‌నాకి వ‌స్తే ఇక ఆత‌ర్వాత క్రికెట్ ను కాపాడ‌డం ఎవ‌రి త‌రం కూడా కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter