భూమా ఫ్యామిలీకి బాబు హ్యాండ్..!

bhuma cbn

నంద్యాల టీడీపీలో ముసలం పుట్టింది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో చంద్ర‌బాబుకి సైతం ఎటూపాలుపోని ప‌రిస్థితి వ‌చ్చేస్తోంది. భూమా కుటుంబానికి సానుభూతి క‌లిసి వ‌స్తుంద‌నుకుంటే అఖిల ప్రియ తీరుతో ఒక్కొక్క‌రుగా దూర‌మ‌య్యే ప్ర‌మాదం ముంచుకొస్తోంది. ఇప్ప‌టికే కీల‌క నేత శిల్పామోహ‌న్ రెడ్డి చేజారిపోయారు. ఆయ‌న వెంట భారీ సంఖ్య‌లో నేత‌లు వెళుతున్నా క‌నీసం జాగ్ర‌త్త‌లు తీసుకోలేక‌పోయామ‌ని టీడీపీ అధిష్టానం చింతిస్తోంది. మునిసిప‌ల్ చైర్మ‌న్, కౌన్సిల‌ర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు పెద్ద సంఖ్య‌లో చేజారిపోవ‌డంతో ఇప్పుడు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అందుకు తోడు భూమా ముఖ్య అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా కాలుదువ్వ‌డంతో క‌థ కొత్త మ‌లుపు తిరిగింది. వేరుకుంప‌టి కోసం ప్ర‌త్యేకంగా త‌న వ‌ర్గంతో స‌మావేశం నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపింది.దాంతో న‌ష్ట‌నివార‌ణ కోసం ఇప్పుడు అధినేత ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. క‌ర్నూలు జిల్లా కీల‌క‌నేత‌లు, నంద్యాల నేత‌లంద‌రినీ అమ‌రావ‌తికి పిలిచారు.

అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది గానీ అఖిలప్రియ వ్య‌వ‌హారాల ప‌ట్ల ఇప్పుడు టీడీపీలో పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఆమె వ‌ల్ల పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌నే ప్ర‌చారం చేస్తోంది. మంత్రిగా ఉన్న ఆమె వ్య‌వ‌హార‌శైలి చివ‌ర‌కు సొంత మ‌నుషుల్లోనే చీలిక తెస్తున్న‌ట్టు ఇత‌రులు ఎలా క‌లిసొస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. చివ‌ర‌కు చంద్ర‌బాబు కూడా ప్ర‌త్యామ్నాయం వైపు దృష్టి పెట్టారా అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. తాజాగా రాజ‌ధానిలో జ‌ర‌గ‌బోతున్న చ‌ర్చ‌ల‌కు ఎంపీ ఎస్పీవై రెడ్డిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఎంపీతో పాటు అల్లుడు శ్రీధ‌ర్ రెడ్డిని కూడా రావాల‌ని టీడీపీ అధిష్టానం నుంచి ఆహ్వానం అంద‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వాస్త‌వానికి ఎస్పీవై రెడ్డి కూడా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ. ఇటీవ‌ల ఆయ‌న అనారోగ్యం రీత్యా క్రియాశీల‌కంగా క‌నిపించ‌డం లేదు. కానీ ఇప్పుడు అఖిల‌ప్రియ‌ను న‌మ్ముకుని నంద్యాల బ‌రిలో దిగితే నిండామునిగిపోతామ‌నే అంచ‌నాకు వ‌చ్చిన చంద్ర‌బాబు ప్ర‌త్యామ్నాయంగా ఎస్పీవైని ఆశ్ర‌యిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

నంద్యాల‌లో కీల‌క‌మైన మైనార్టీ వ‌ర్గం నుంచి సీనియ‌ర్ నేత ఎన్ఎండీ ఫరూఖ్ ఉన్నారు. ఆయ‌న త‌న‌యుడు కూడా సీటు ఆశిస్తున్నారు. అయినా చంద్ర‌బాబు మాత్రం రెడ్ల‌వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. భూమా కుటుంబానికి సానుభూతి అస్త్రం ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని తొలుత అంచ‌నాలు వేశారు. అయినా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి క‌న్నా బెట‌ర్ అభ్య‌ర్థి ఎవ‌రా అని ఆలోచిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎస్పీవై అల్లుడు శ్రీధ‌ర్ రెడ్డి, కుమార్తె కూడా బ‌య‌లుదేరి అమ‌రావ‌తి వెళ్ల‌డం ఆస‌క్తిదాయ‌క‌మే. తాజా అంచ‌నాల ప్ర‌కారం భూమా అఖిలప్రియ మీద విశ్వాసం స‌న్న‌గిల్లి బ్ర‌హ్మానందరెడ్డికి హ్యాండిస్తే దాని ప్ర‌భావం ఎలా ఉంటుంద‌నే విష‌యం మీద కూడా ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఎస్పీవై సార‌ధ్యం ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అంచ‌నాల్లో టీడీపీ అధిష్టానం క‌నిపిస్తోంది. జిల్లాకు చెందిన నేత‌లంద‌రి అభిప్రాయాలు సేక‌రించిన త‌ర్వాత బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. నంద్యాల టీడీపీలో ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter