శిరీష విష‌యంలో త‌ప్పంతా అత‌డిదే..!

sravani

సంచలనం రేపిన మేకప్‌ ఆర్టిస్ట్‌ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధమ నిందితుడు(ఏ1) శ్రవణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శిరీష మరణంలో తన ప్రమేయమేదీ లేదని, జరిగిన విషయాలన్నింటికీ కారణం రాజీవేనని అన్నాడు.

శనివారం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన సమయంలో శ్రవణ్‌ తన గోడును మీడియా ముందు వెళ్లగక్కాడు. రాజీవ్‌ను కాకుండా, శ్రవణ్‌ను ఏ1గా చేర్చడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లైంది.

నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన శ్రవణ్‌ ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్లు సంబంధిత ఫొటోలు కూడా టీవీల్లో ప్రసారమయ్యాయి. ఎస్సై పరీక్షలకు కోచింగ్‌ పేరుతో హైదరాబాద్‌లో ఉంటుండగా శిరీష, రాజీవ్‌లు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఎస్సై ప్రభాకర్‌ రెడ్డితో నల్లగొండలో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

శిరీష కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న శ్రావణ్‌, రాజీవ్‌లకు శనివారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఇరువురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter