శిరీష కేసు చేధించిన పోలీసులు

sirisha

ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్‌ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్‌ శిరీష మృతిపై సందేహాలు పటాపంచలయ్యాయి. ఎట్టకేలకు శిరీష మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ఆత్మహత్యగా.. అనంతరం అనుమానాస్పద మృతిగా మారిన ఈ కేసును చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌గా పోలీసులు నిర్థారించారు. సీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ కేసు వివ‌రాల‌ను మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

రాజీవ్ తో శారీర‌క సంబంధాలున్న బ్యుటీషియ‌న్ శిరీష తో తేజ‌స్వినికి ప‌లుమార్లు వివాదాలు జ‌రిగిన‌ట్టు తెలిపారు. రాజీవ్ తో ఫేస్ బుక్ లో ప‌రిచ‌య‌మ‌యిన తేజ‌స్విని ఆయ‌న్ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న స‌మ‌యంలో శిరీష్ తో సంబంధం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఈ త‌గాదా వచ్చిన‌ట్టు వెల్ల‌డించారు. దాంతో స‌మ‌స్య ప‌రిష్కారం కోసం రాజీవ్ త‌న మిత్రుడు శ్రావ‌ణ్ ని క‌లిసిన‌ప్పుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి అనే కుకునూరుప‌ల్లి ఎస్సైని సీన్ లోకి తెచ్చిన‌ట్టు వెల్ల‌డించారు.

శిరీష‌తో క‌లిసి రాజీవ్, శ్రావ‌ణ్ కుకునూరుప‌ల్లి వెళ్లి ప్ర‌భాక‌ర్ రెడ్డిని క‌లిసిన స‌మ‌యంలో ఎస్సై ప్ర‌వ‌ర్తించిన తీరుతో శిరీష మ‌న‌స్తాపం చెందిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్నారు. మ‌ద్యం మ‌త్తులోనే ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇలాంటి ప్ర‌య‌త్నం చేసి ఉంటార‌ని చెబుతున్నారు. దాంతోనే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter