మోడీ అనూహ్య నిర్ణ‌యం: కొత్త ప్రెసిడెంట్

ramnath

బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని అభ్య‌ర్థిని తెర‌మీద‌కు తెచ్చింది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు ఎన్డీయే త‌రుపున బీహార్ గ‌వ‌ర్న‌ర్ ని రంగంలో దింపుతోంది. ఈ విష‌యాన్ని బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌క‌టించారు. దాంతో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ప‌లు పేర్లు ప‌రిశీలించిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు రామ్ నాథ్ కోవింద్ భార‌త రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యే అవ‌కాశం ద‌క్కింది.

ప్ర‌స్తుతం బీహార్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న రామ్ నాథ్ చాలాకాలంగా ఆర్ఎస్ఎస్ సంస్థ‌ల‌కు వెన్నుద‌న్నుగా ఉన్నారు. కీల‌క‌భూమిక పోషించారు. అక్టోబ‌ర్ 1 , 1945 నాడు కాన్పూర్ జిల్లా ప‌రౌంఖ్ తెహ్సిల్ అనే గ్రామంలో జ‌న్మించారు. ఢిల్లీలో స్థిర‌ప‌డ్డారు. గ‌తంలో ఆయ‌న 1994 నుంచి 2000 వ‌ర‌కూ బీజేపీ త‌రుపున ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. స్వ‌త‌హాగా న్యాయ‌వాది అయిన రామ్ నాథ్ బీజేపీకి తో చిర‌కాల స‌న్నిహితంగా ఉంటున్నాడు.

వాస్త‌వానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని బీజేపీ ఆశిస్తోంది. అయితే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌కుండా మ‌ద్ద‌తు ఎలా కోర‌తార‌ని ఇప్ప‌టికే విప‌క్షాలు ప్ర‌శ్నించాయి. త్రిస‌భ్య బృందం జ‌రుపుతున్న చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం అవుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు శివ‌సేన కూడా ఎదురుతిరిగింది.ఈ నేప‌థ్యంలోనే ఎస్సీ సామాజికవ‌ర్గానికి చెందిన రామ్ నాథ్ ను బీజేపీ అధిష్టానం , అందులోనూ మోడీ-అమిషా ద్వ‌యం ముందుకు తెచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక ఇప్పుడు విప‌క్షాల అభ్య‌ర్థిని రంగంలో దింపుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే. విప‌క్షం రంగంలో ఉన్నా ఎన్డీయే త‌రుపున బ‌రిలో నిల‌వ‌బోతున్న రామ్ నాథ్ కే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. కాబ‌ట్టి త‌దుప‌రి రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter