షాకిచ్చిన పెట్రోల్ బంకులు..అర్ధరాత్రి నుంచి బంద్

petrol

నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో ఏటీఎం కార్డుల ద్వారా చెల్లింపులు నిలిచిపోనున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై బంకుల డీలర్ల నుంచే అదనపు ఛార్జీలను వసూలు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తాము కార్డు లావాదేవీలను నిషేధిస్తున్నామని ఇండియన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అమరమ్ రాజీవ్ తెలిపారు.

డీజిల్‌పై 2.5 శాతం, పెట్రోల్‌పై 3.2 శాతం చొప్పున డీలర్లకు కమీషన్ వస్తుందని, అందులో నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం సరికాదని రాజీవ్ చెప్పారు. పెట్రోలు బంకుల్లో లావాదేవీలు 80 శాతం కార్డుల ద్వారానే జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో అదనపు ఛార్జీలు తమ వద్ద నుంచి వసూలు చేస్తామంటే ఎలా అని డీలర్లు ప్రశ్నిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter