అసెంబ్లీ సమావేశాల కన్నా ఎక్కువ టెన్షన్ అనుభవించా…

ktr

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటీఆర్ కు ఎక్కడ లేని టెన్షన్ పట్టుకొందిప్పుడు.మరేంలేదండి. తన ఎనిమిదేళ్ల కూతురు చదువుతున్న స్కూల్లో జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్‌కు కు హాజరయ్యారు. అక్కడి ఉపాధ్యాయులతో తన కూతురు చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే బాధ్యతగల తండ్రిగా ఈ మీటింగ్‌కు వెళ్లేముందు తాను చాలా ఆందోళనను అనుభవించానని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అసెంబ్లీలో జరిగే చర్చల కన్నా, ఎన్నికల కన్నా ఎక్కువ టెన్షన్ తన కూతురి పేరెంట్ మీటింగ్‌కు హాజరవ్వడానికి అనుభవించానని ఆయన అన్నారు. అయితే ఈ సమావేశం తాను అనుకున్న దానికన్నా బాగా జరిగిందని, తరుచుగా ఈ మీటింగ్‌కు తప్పక హాజరౌతానని కెటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter