ఓ అడుగు ముందే వైసీపీ..!

19225778_10213388402094860_8898799616948943078_n

రాజ‌కీయాల్లో తానే సీనియ‌ర్ న‌ని చెప్పుకునే చంద్ర‌బాబుకే అంతుబ‌ట్ట‌ని రీతిలో వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజా రాజ‌కీయాల్లో జాతీయ స్థాయిలో బాబుని మించిన రీతిలో వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీలో వెంక‌య్య త‌ప్ప మ‌రో అవ‌కాశ‌మే లేకపోవ‌డ‌తో బాబు అన్నింటికీ ఆ సీనియ‌ర్ బీజేపీ నేత మీద ఆధార‌ప‌డాల్సి వ‌స్తుండ‌గా వైసీపీ త‌రుపున విజ‌యసాయిరెడ్డి చ‌క్రం తిప్పేస్తున్నారు. పార్ల‌మెంట్ లో అడుగుపెట్టి పూర్తిగా రెండేళ్ల‌యినా కాక‌ముందు నుంచే విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హార‌దక్ష‌త ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు టీడీపీ నేత‌లంతా కాబోయే రాష్ట్ర‌ప‌తి ఎవరా అని ఆలోచిస్తుంటే విజ‌య‌సాయిరెడ్డి వెళ్లి ఏకంగా ఇర‌వై రోజుల క్రిత‌మే ప్ర‌స్తుత బీహార్ గ‌వ‌ర్న‌ర్ ని క‌లిసిరావ‌డం విశేషం. బీహార్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న రామ్ నాథ్ కోవింద్ త్వ‌ర‌లో కాబోయే రాష్ట్ర‌ప‌తి కావ‌డం విశేషం.

చంద్ర‌బాబుకి కేంద్ర ప్ర‌భుత్వంలో ఇద్ద‌రుమంత్రులున్నారు. ఆయ‌న‌పార్టీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంది. వెంక‌య్య ఆశీస్సులున్నాయి. పైగా వారి అనుంగు ప‌త్రిక‌ల నుంచి స‌మాచారం ఉంటుంది. అయినా ఈ విష‌యాన్ని క‌నిపెట్ట‌లేక‌పోయారు. అదే స‌మ‌యంలో విప‌క్ష నేత మాత్రం ఏకంగా పాట్నా వెళ్లి మ‌రీ రామ్ నాథ్ కోవింద్ ని గ‌త మే నెల‌లో క‌లిసి రావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఢిల్లీలో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పాన‌ని చంద్ర‌బాబు చెబుతుండ‌గా ఇప్పుడు ఆయ‌న పాచిక‌లు పార‌డం లేద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. అదే స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి మాత్రం వేగంగా పావులు క‌దుపుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

రామ్ నాథ్ కోవింద్ అభ్య‌ర్థిత్వం ఖ‌రార‌యిన త‌ర్వాతే వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి మోడీని క‌లిసి వ‌చ్చి ఉంటార‌ని ఇప్పుడు అనుమానిస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌మ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వాల‌ని మోడీ కోరిన వారిలో కేసీఆర్, వైఎస్ జ‌గ‌న్ వంటి వారు కూడా ఉన్నారు. చివ‌ర‌లో మాత్ర‌మే బాబుకి మోడీ నుంచి కాల్ వ‌చ్చింది. అభ్య‌ర్థి విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన కొద్దిసేప‌టికి బాబుకి మోడీ ఫోన్ చేసిన‌ట్టు స‌మాచారం. దాంతో ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ్య‌వ‌హారం పుణ్య‌మా అని ఢిల్లీ వ్య‌వ‌హారాల్లో కూడా వైసీపీ ముందంజ‌లో ఉంద‌నే వాద‌న బ‌య‌లుదేరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter