చంద్రబాబు ఆగ్రహంతో ఆ ఇద్దరిపై …

cm

సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలో శనివారం ఉదయం తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌.. వ్యహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా రావి, అన్న సతీష్‌ల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ తక్షణమే వచ్చి తనను కలవాలని సీఎం ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేక్షించవద్దని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
ఇటీవల గుడివాడ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తుపాకి మిస్‌ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. బాపట్ల సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌లో శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ అన్నం సతీష్‌, అనచరులు పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్‌, సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను చంద్రబాబు తీవ్రంగా మందలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter