ఆ ఇద్దరు టీడీపీ నేతలను క్యాంపు ఆఫీస్‌కు పిలిపించి…

ap cm chandrababu

వివాదాల్లో ఇరుకున్న టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు కన్నెర్ర చేశారు.వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్, రావి వెంకటేశ్వరరావులను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని క్లాస్ పీకారు. కృష్ణాజిల్లా గుడివాడ, గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఈ ఘటనలు చంద్రబాబుకు తీవ్రఆగ్రహన్ని తెప్పించాయి. బాపట్ల టీడీపీ నేత ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ సూర్యలంక హరిత బీచ్ రీసార్ట్‌లో పర్యటక శాఖ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కారణం లేకుండా ఉద్యోగి శ్రీనివాస్‌ను కొట్టారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై వారు ఆందోళన ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో అన్నం సతీష్‌పై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు రివాల్వర్ మిస్ పైర్ ఘటన సంచలనం రేపింది. గుడివాడ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావుతో పాటు వైసీపీ నేత కొడాలి నాని కూడా పాల్గొన్నారు. అక్కడ వెంకటేశ్వరరావు రివాల్వర్ మిస్ పైర్ అయింది. అయితే రావినే గాల్లోకి పేల్చారని కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది.ఈ రెండు ఘటనలో చంద్రబాబు దృష్ఠికి వెళ్లడంతో ఈ ఇద్దరి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇద్దరిని క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించారు. వారిద్దరు పరుగు పరుగున సీఎం నివాసానికి చేరుకుని వివరణ ఇచ్చారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు మంచిది కాదని వారిని గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన నేతలు ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని పార్టీ నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter