సెల్ఫీతో తాప్సీ మిస్స‌య్యింది..!

tapsee

ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఇటీవల షూటింగ్‌ నుంచి విరామం తీసుకొని కొద్ది రోజుల పాటు కుటుంబం, స్నేహితులతో కలిసి సరదాగా గడిపి ముంబయికి పయనమయ్యేందుకు తాప్సీ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అభిమానులు ఆమెను చూసి ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. తమ అభిమానంతో కాసేపు ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో ఆమె ఎక్కాల్సిన ముంబయి విమానం కాస్తా వెళ్లిపోయింది. ఇక చేసేదేమి లేక తర్వాతి విమానంలో ఆమె ముంబయి చేరుకున్నారు.

ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ.. ‘సాధారణంగా నేను విమానాశ్రయాలు, మాల్స్‌, బహిరంగ ప్రదేశాల్లో అభిమానులతో కలిసి ఫొటోలు దిగను. ఎందుకంటే నేను ఎటువంటి భద్రత లేకుండా ప్రయాణం చేస్తాను.. అభిమానులు ఒక్కసారిగా నా దగ్గరికి వస్తే వాళ్లని సముదాయించడం కష్టమవుతుంది. కానీ కొంతమంది అభిమానుల ప్రేమ మాత్రం నా హృదయాన్ని హత్తుకుంటుంది. ఢిల్లీ విమానాశ్రయంలోకి రాగానే కొంతమంది కళాశాల విద్యార్థులు నన్ను చూసి నా దగ్గరికి వచ్చారు. నేను నటించిన సినిమాలు, అందులోని నా పాత్రల గురించి నాకు వాళ్లు చెప్పిన తీరు ఆకట్టుకుంది. వాళ్లందరూ నాతో సరదాగా సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోయారు. దాంతో నా విమానం వెళ్లిపోయింది’ అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter