రామ్ చ‌ర‌ణ్ కి స్వ‌ల్ప‌గాయాలు

ramcharan

మెగా ప‌వ‌ర్ స్టార్ కి అనుకోని ఎదురుదెబ్బ త‌గిలింది. గోదావ‌రి తీరంలో జ‌రుగుతున్న రంగ‌స్థ‌లం 1985 సినిమా షూటింగ్ లో హీరో చెర్రీ గాయ‌ప‌డ్డాడు. స్వ‌ల్ప గాయాలు మాత్ర‌మే కావ‌డంతో ఆయ‌న లెక్క చేయ‌కుండా షూటింగ్ కొన‌సాగించ‌డం విశేషం. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌మీపంలోని గోదావ‌రి తీరంలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా కావ‌డంతో ఆస‌క్తిగా క‌నిపిస్తోంది.

ఓ మారుమూల గ్రామంలో ప్ర‌స్తుతం యూనిట్ సినిమా ప‌నిలో ఉంది. ఇది చాలా కఠిన షెడ్యూల్‌ అని, సూర్యోదయాని కన్నా ముందే చిత్రీకరణ ప్రారంభమై, సూర్యాస్తమయం అయ్యేవరకూ జరుగుతోందని చిత్ర బృందం చెబుతోంది. సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, రామ్‌చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయట. వాటిని లెక్క చేయకుండా చెర్రీ షూటింగ్‌లో పాల్గొంటున్నారని చిత్ర బృందం చెబుతోంది. ఈనెల చివరికి వరకూ ఈ షెడ్యూల్‌ జరగనుంది. తర్వాతి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. కళా దర్శకుడు రామకృష్ణ సినిమా సెట్‌ల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ ‘రంగస్థలం’ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter