ఎన్టీఆర్ పాట‌కు బాల‌య్య స్టెప్స్

balayya

అలనాటి చిత్రాలలోని పాటల పల్లవులను సినిమా టైటిల్స్‌గా పెట్టడం, అలాగే పాటలను రీమిక్స్‌ చేయడం ఇటీవల సర్వ సాధారణం అయిపోయింది. గతంలో నందమూరి తారకరామారావు నటించిన ‘యమగోల’ చిత్రంలోని ‘ఓలమ్మి తిక్కరేగిందా..’అనే పాటను ‘యమదొంగ’ చిత్రంలో జూ.ఎన్టీఆర్‌ రీమిక్స్‌ చేశారు.

ఆ పాటకు తాతగారి మాదిరిగానే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ చిత్రంలోని మరో పాటను ఆయన తనయుడు బాలకృష్ణ రీమిక్స్‌ చేయబోతున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్‌’లో ఎన్టీఆర్‌ నటించిన ‘జీవితచక్రం’ చిత్రంలోని ‘కంటి చూపు చెప్తోంది.. కొంటె నవ్వు చెప్తోంది..’ అనే పాటను రీమిక్స్‌ చేస్తున్నారు.

దీనికి సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ తనదైన స్టయిల్‌లో బాణీ కడుతున్నారట. ‘ఇందులో రీమిక్స్‌ చేసిన నాన్నగారి చిత్రంలోని పాటను అందరూ ఎంజారు చేస్తారు. అలాగే ఓ పాటను స్వయంగా నేనే పాడాను. దానితోపాటు మరో ఐటెమ్‌ సాంగ్‌ మిమ్మల్ని అలరిస్తుంది’ అని ఇటీవల బాలకృష్ణ తన అభిమానులను ఉద్దేశించి తెలిపిన విషయం విదితమే. బాలకృష్ణ సరసన శ్రియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter