ఫిల్మ్ ఫేర్ లో ఎన్టీఆర్ టాప్

ntr

64వ ఫిలింఫేర్ అవార్డ్స్(సౌత్) వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందిన నటీనటులు, దర్శక, నిర్మాతలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన సినీ ప్రముఖులతో ఆ ప్రాంగణం కోలాహాలంగా మారింది. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరోలు అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ హోస్టులుగా వ్యవహరించారు.

ఈ అవార్డుల్లో ఎన్టీఆర్ సినిమాల హవా కనిపించింది. ఎన్టీఆర్, రకుల్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’కు మూడు అవార్డులు దక్కగా, ‘జనతా గ్యారేజ్’కు రెండు విభాగాల్లో అవార్డులు లభించాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో అత్యుత్తమ నటన కనబరిచిన ఎన్టీఆర్‌ ఉత్తమ నటుడు, ప్రతినాయక పాత్రలో అదరగొట్టిన జగపతిబాబుకు ఉత్తమ సహాయనటుడు అవార్డును అందుకున్నారు. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన జనతా గ్యారేజ్‌ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఈ సినిమా ‘ప్రణామం ప్రణామం’ పాటను రాసిన రామజోగయ్య శాస్త్రికి ఉత్తమ పాటల రచయితగా అవార్డు లభించగా, యాపిల్ బ్యూటీ పాటకు గానూ ఉత్తమ నృత్య దర్శకుడిగా శేఖర్ మాస్టర్ ఎంపికయ్యాడు.

అలాగే ఉత్తమ నటిగా సమంత, ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు, ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి అవార్డులను అందుకున్నారు. సీనియర్ నటి విజయ నిర్మలను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.

ఫిలింఫేర్ విన్నర్స్ వీళ్లే:
ఉత్త‌మ న‌టుడు- జూనియర్ ఎన్టీఆర్‌(నాన్నకు ప్రేమతో)
ఉత్త‌మ న‌టి – స‌మంత‌(అ..ఆ)
ఉత్త‌మ చిత్రం- పెళ్లి చూపులు
ఉత్తమ దర్శకుడు- వంశీ పైడిపల్లి(ఊపిరి)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు- జ‌గ‌ప‌తిబాబు(నాన్నకు ప్రేమతో)
ఉత్త‌మ లిరిసిస్ట్‌- రామ‌జోగ‌య్య శాస్త్రి(ప్రణామం.. జనతా గ్యారేజ్)
ఉత్తమ స‌హాయ‌న‌టి-నందిత శ్వేత‌(ఎక్కడికి పోతావు చిన్నవాడ)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు- కార్తీక్‌(వెళ్లిపోకే శ్యామలా.. అ..ఆ)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని-కె.ఎస్‌.చిత్ర‌(ఈ ప్రేమకి.. నేను శైలజ)
ఉత్త‌మ మ్యూజిక్ ఆల్బ‌మ్‌- దేవీశ్రీ ప్ర‌సాద్ (నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్తమ న‌ృత్య దర్శకుడు- శేఖర్ మాస్టర్(యాపిల్ బ్యూటీ.. జనతా గ్యారేజ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ- పీఎస్ వినోద్(ఊపిరి)
క్రిటిక్ ఉత్త‌మ న‌టుడు- అల్లు అర్జున్‌
క్రిటిక్ ఉత్త‌మ న‌టి- రితు వ‌ర్మ
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- విజయ నిర్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter