మల్టీస్టార‌ర్ మువీలో మ‌హేష్

mahesh

యంగ్ హీరోస్ సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలే మంచి రోజు ఫేం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోలకు సమానమైన మరో కీలక పాత్ర ఉందట.. ఆ పాత్ర పేరే మహేష్ బాబు. కీలకమైన క్యారెక్టర్ కోసం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు.

తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను గురువారం రిలీజ్ చేయనున్నారు. భవ్యక్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter