బాహుబ‌లిని బ్రేక్ చేసిన చిరంజీవి

71476786285_625x300

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్ 150. చిరు తొమ్మిదిన్నరేళ్ల విరామం తరువాత మెగాస్టార్ హీరోగా నటించిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిరంజీవి కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో అభిమానులను అలరించాడు. ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. గతంలో రికార్డులు సాధించిన ప్రతీ తెలుగు సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకునేది. కానీ ఖైదీ దెబ్బకు బాహుబలి రికార్డ్స్ కూడా చెరిగిపోయాయంటున్నారు ఫ్యాన్స్.

తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఖైదీ నంబర్ 150 సరికొత్త రికార్డ్ ను సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లను సాధించిన ఖైదీ నంబర్ 150 ఒక్క రోజులో 39 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్ ను దాటి కొత్త చరిత్ర సృష్టించాడు. తొమ్మిదేళ్ల విరామం తరువాత కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న చిరు స్టామినా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *