ఖైదీని విడిచిపెట్ట‌ని వ‌ర్మ ..శాత‌క‌ర్ణిపై మాత్రం…!

1482628401413753-361842-ram-gopal-varma

నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. ‘హే క్రిష్.. నా జడ్జిమెంట్ సరైనదేనని వినపడుతుండటం ఎంతో థ్రిల్లింగ్ కు గురిచేస్తోంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి రోరింగ్ టాక్ వస్తున్నందుకు నీకు అభినందనలు. నీకు, బాలయ్యకు హండ్రెడ్ ఛీర్స్’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

‘శాతకర్ణి’ విజయం నేపథ్యంలో ముంబైలోని నాలుగు కంపెనీలు దర్శకుడు క్రిష్ తో ఒప్పందాలు చేసుకున్నాయని, దీంతో తాను చాలా ఈర్ష్య పడుతున్నానని వర్మ అన్నారు. ఈ నాలుగు ఒప్పందాలలో ఒకటి ఏకే (ఆమిర్ ఖాన్?) నుంచి కాగా, మరొకటి ఎస్ కే (షారుఖ్ ఖాన్?) నుంచి కూడా ఉందని తెలుస్తోందని, క్రిష్ దీనిని కన్ఫర్మ్ చేస్తావా? అని వర్మ అడిగారు.

అరువు తెచ్చుకున్న కంటెంట్ తో తెలుగు సినిమా పరువును దెబ్బతీయడానికి బదులు… ఒరిజినల్ కంటెంట్ తో తెలుగు సినిమా ప్రతిష్టను ఆకాశమంత ఎత్తు చేర్చినందుకు క్రిష్ కు, బాలయ్యకు సెల్యూట్ చేస్తున్నానని వర్మ కొనియాడారు. గొప్ప సినిమాల విషయంలో బాలయ్య వందో సినిమా 150సార్లు మెగా అడ్వాన్స్ డ్ గా ఉందంటూ పేర్కొన్నారు.

‘ఖైదీ నంబర్ 150’ సినిమా వేడుకలో నాగాబాబు తనపై విమర్శలు చేయడంతో వర్మ అంతే ఘాటుగా మెగా బ్రదర్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యను ప్రశంసిస్తూనే.. అరువు తెచ్చుకున్న కథతో తెలుగు సినిమా పరువు తీయడానికి బదులు అంటూ పరోక్షంగా తమిళ ‘కత్తి’ సినిమా రీమేక్ అయిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాహుబలితో మొదలైన తెలుగు సినిమా ఖ్యాతిని శాతకర్ణి మరింత ముందుకు తీసుకెళ్లిందని, దీంతో మెగా వ్యక్తులు తాము మినీగా మారిపోయామని గుర్తించి ఉండరని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter