ఎన్టీవీ అలా దొరికిపోయింది..!

ntv narendra chowdary

తెలుగు మీడియా చానెళ్ల యాజ‌మాన్యాల వ్య‌వ‌హారాలు అంద‌రికీ తెలిసిందే. రామోజీ వ్యాపారాలు, రాధాకృష్ణ భాగోతాలు, టీవీ9 వ్య‌వ‌హారాలు, ఎన్టీవీ కాంట్రాక్టులు ఇలా ఒక్కో చానెల్ ది ఒక్కో వ్య‌వ‌హారం. అందుకే కార్పోరేట్ వ్యాపారులు న‌డుపుతున్న టీవీల‌లో క‌హానీలే త‌ప్ప పెద్ద‌గా వాస్త‌వాలు క‌ష్ట‌మే అన్న‌ది సామాన్యుల అభిప్రాయం. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉంది ఎన్టీవీ వ్య‌వ‌హారం.

ప్ర‌స్తుతం ఎన్టీవీలో పొలిటిక‌ల్ మ‌సాలా పెంచుతున్నారు. గ‌తంలో కొమ్మినేని ఈ చానెల్ ను వీడిన త‌ర్వాత రాజ‌కీయాంశాలు త‌గ్గిపోయాయ‌నే అభిప్రాయం క‌నిపించింది. దాంతో కాస్త మ‌సాలా ద‌ట్టించి నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నేత‌ల భాగోతాలు వెల్ల‌డించే ప‌ని ప్రారంభించారు. కానీ ఇక్క‌డ కూడా పాల‌క‌పార్టీకి పెద్ద‌గా ఇబ్బంది రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు ఉదాహ‌ర‌ణే ఈ వ్య‌వ‌హారం. చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రిపోర్ట్ ప్ర‌సారం చేస్తూ ఎన్టీవీ సాగించిన ప్ర‌హ‌స‌నం ఇప్పుడు ప‌లువురి ద‌గ్గ‌ర అభాసుపాలుకావ‌డానికి కార‌ణంగా మారింది. కొద్దిరోజుల క్రితం రాజ‌స్తాన్ లో జ‌రిగిన పోలీస్ చ‌ర్య‌ను తెలంగాణా పోలీసుకి ఆపాదించ‌డం ద్వారా టీవీ9తో పాటు ఎన్టీవీ కూడా ప‌రువు పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే
19030742_1334108543311549_7597361078933525719_n

ఇప్పుడు మ‌రోసారి పీలేరు ఎమ్మెల్యే రామ‌చంద్రారెడ్డి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాయాల‌నే తొంద‌ర‌లో ఏకంగా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు ఇచ్చిన వాయిస్ బైట్ ను పీలేరు ఎమ్మెల్యేకి వాడేయ‌డం చాలామందిని విస్మ‌యానికి గురిచేస్తోంది. ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలోని వీ కోట‌కు చెందిన పీఎన్ నాగ‌రాజు అనే పై ఫోటోలో ఎన్టీవీతో మాట్లాడుతున్న నేత‌ను పీలేరు స్థానికుడిగా చెప్ప‌డం, ఎమ్మెల్యే తీరును స్థానికులు వ్య‌తిరేకిస్తున్నారంటూ వ్యాఖ్యానాలు చేయ‌డం ఎన్టీవీ వైఖ‌రిని తేట‌తెల్లం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌సార‌మ‌యిన క‌థ‌నాల మీద ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ పీలేరులో మాత్రం వైసీపీ నేత‌నే వైసీపీ ఎమ్మెల్యేకి వ్య‌తిరేకంగా మాట్లాడిన‌ట్టు చూపించ‌డంతో ఎన్టీవీ ఇరుకున‌ప‌డింది. దాంతో ఈ వ్య‌వ‌హారం మీద పీలేరు ఎమ్మెల్యే వ‌ర్గీయులు మండిప‌డుతున్నారు. ఎన్టీవీ మీద ఫిర్యాదుల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అబ‌ద్ధాలు ప్ర‌సారం చేశారంటూ న్యాయ‌పోరాటానికి సైతం సిద్ధ‌మంటున్నారు. ఇప్పుడీ వ్య‌వ‌హారం చిత్తూరు జిల్లాలో ఎన్టీవీ ప‌రువు గంగ‌పాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter