జ‌గ‌న్ కి చేరువుగా బాబు స‌న్నిహితుడు

yarlagadda

ఆయ‌న జ‌నం నేత కాక‌పోవ‌చ్చు గానీ, ఒక త‌ర‌గ‌తిని ప్ర‌భావితం చేయ‌గ‌ల ప్ర‌ముఖుడు. భాషా, సాంస్కృతిక రంగాల్లో విశేష‌మైన ఖ్యాతిక‌లిగిన మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు. రెండు ద‌శాబ్దాల క్రిత‌మే టీడీపీ త‌రుపున ఆయ‌న పెద్ద‌ల స‌భ‌లో అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత క్రియాశీల‌కంగా కాక‌పోయినా ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. కీల‌క సంద‌ర్భాల్లో పార్టీకి అండ‌గా ఉన్నారు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు కాస్త ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. చంద్ర‌బాబు తీరుతో విసుగు చెందిన‌ట్టు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ చూపు వైఎస్ జ‌గ‌న్ వైపు మ‌ర‌లిన‌ట్టు విశ్వనీయ వర్గాల కథనం

యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ టీడీపీకి అన‌ధికార స‌భ్యుడిగానే ఇన్నాళ్లుగా భావించారు. అయినప్ప‌టికీ గ‌డిచిన మూడేళ్ల‌లో ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరుపై వీలు దొరికిన ప్ర‌తీసారి కొంత అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. చివ‌ర‌కు నేరుగా కూచిపూడి లో నిరాహార దీక్షకి కూర్చోవటం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది. ఒక‌నాటి చంద్రబాబు స‌న్నిహితుడు ఇప్పుడు ప్ర‌భుత్వ విధానాల‌పై క‌న్నెర్ర చేయ‌డం విశేషంగా మారింది. ఆ త‌ర్వాత కూడా అనేక‌మార్లు చంద్ర‌బాబుకి రుచించ‌ని రీతిలో ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. దానికి ప్ర‌ధాన కార‌ణంలో గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చంద్ర‌బాబు త‌న‌కు ఇచ్చిన గౌర‌వాన్ని ఇప్పుడు క‌నీసం కూడా ఇవ్వ‌డం లేద‌నే బాధ యార్ల‌గ‌డ్డ‌లో ఉండ‌డ‌మే అంటున్నారు.

త‌న‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌ని గుర్రుగా ఉన్న ల‌క్ష్మీప్ర‌సాద్ తాజాగా వైఎస్ జ‌గ‌న్ తో స‌న్నిహితంగా మెల‌గ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. వ‌రుస‌గా రెండు రోజుల పాటు రెండు కార్య‌క్ర‌మాల్లో ఇరువురు క‌లిసి సాగారు. దాస‌రి నారాయ‌ణ‌రావు సంస్మ‌ర‌ణ స‌భ‌కు హాజ‌ర‌యిన జ‌గ‌న్ కి యార్ల‌గ‌డ్డ విశేష‌మైన ప్రాధాన్య‌త‌నిచ్చారు. అత్యంత స‌న్నిహితంగా మెలిగారు. ఆత‌ర్వాత సి నారాయ‌ణ‌రెడ్డికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించ‌డానికి జ‌గ‌న్ వెళ్లిన స‌మ‌యంలో కూడా యార్ల‌గ‌డ్డ అదే చొరవ ప్ర‌ద‌ర్శించారు. వైసీపీ అధినేత‌తో చ‌నువుగా సాగారు. దాంతో ఇది ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. చంద్ర‌బాబు మీద ఆగ్ర‌హంతో జ‌గ‌న్ కి చేరువ‌కావ‌డానికి యార్ల‌గ‌డ్డ వారు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుకి ఎదురుగాలి వీస్తుండ‌డం, అది జ‌గ‌న్ కి సానుకూలంగా మారుతుంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే యార్ల‌గ‌డ్డ వంటి ప‌లువురు మేథావులు, ప్ర‌ముఖులు కూడా వైసీపీ అధినేత‌ను మ‌చ్చిక చేసుకునే ప‌ని ప్రారంభించార‌న‌డానికి ఈ ప‌రిణామాలు సంకేతమ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నేరుగా పార్టీ తీర్థం పుచ్చుకున్నా లేక‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన సామాజిక‌వ‌ర్గం నుంచి జ‌గ‌న్ కి మద్ధ‌తు కూడ‌గట్ట‌డానికి ల‌క్ష్మీప్ర‌సాద్ ఉప‌యోగ‌ప‌డ‌తార‌నే అంచ‌నాలున్నాయి. దాంతో జ‌గ‌న్, యార్ల‌గ‌డ్డ మ‌ధ్య పెరుగుతున్న బంధం బాబుకి కొంత ఇబ్బందిక‌ర‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter