Category: రాజకీయం

రాజకీయం
ys jagan cbn
హామీలు-అమ‌రావ‌తి ఇవే ప్ర‌ధానాస్త్రాలు.!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు రంగం సిద్ద‌మ‌వుతోంది హైద‌రాబాద్ నుంచి అసెంబ్లీ కార్యాల‌యం త‌ర‌లింపు పూర్తికావస్తోంది. తొలిసారిగా ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. వెల‌గ‌పూడి తాత్కాలిక రాజ‌ధాని ప్రాంతంలో భారీ వ్య‌యంతో నిర్మించిన భ‌వనాలు దానికి వేదిక కాబోతున్నాయి. దాంతో ఈ స‌మావేశాలు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఇక ప‌దవీకాలంలో నాలుగో బ‌డ్జెట్ కి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతుంత‌డ‌డం కూడా మ‌రింత చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఈ బ‌డ్జెట్ త‌ర్వాత మ‌రో బ‌డ్జెట్ కి మాత్ర‌మే య‌న‌మ‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఆ త‌ర్వాత […]

రాజకీయం
jagan ysrcp
జ‌గ‌న్ ను మెప్పించ‌డానికి జంపింగ్ ల‌కో ఛాన్స్..!

జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితులుగా మెలిగిన వారు, చివ‌ర‌కు కోట‌రీలోని వ్య‌క్తులు కూడా ఆయ‌న్ని కాద‌ని చంద్ర‌బాబుని ఆశ్ర‌యించ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కొంత స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు క‌నిపించింది. పార్టీ ఫిరాయించిన త‌ర్వాత కొత్త పార్టీలో స‌ర్థుకోవ‌డానికి కొంద‌రికీ ఇప్ప‌టికీ సాధ్యం కాలేదు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కేస్తే వారిలో ఏడెనిమిది మంది ఎమ్మెల్యేల‌కు ఇప్ప‌టికీ ఇంటిపోరు త‌ప్ప‌డం లేదు. అప్ప‌టికే బ‌ల‌మైన టీడీపీ నేత‌లున్న నియోజ‌క‌వ‌ర్గాల‌లో వ‌ర్గ‌పోరు త‌ప్ప‌డం లేదు. […]

రాజకీయం
MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa
ఒక్క సీటు కోసం వార్ కి సిద్ధ‌మ‌వుతున్న బాబు, జ‌గ‌న్

ఏపీ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సాక్షిగా ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయాల‌కు తెర‌లేవ‌బోతోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వేదిక‌గా మ‌రోసారి వేడి రాజుకుంటోంది. ఏడో స్థానం సాక్షిగా ఎవ‌రికి వారు ప‌ట్టుద‌ల‌కు పోతుండ‌డంతో ప‌రిణామాలు ఎటుమ‌ళ్లుతాయోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఈ విష‌యంలో జ‌గ‌న్, చంద్ర‌బాబు కూడా ప‌ట్టు సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. దాంతో ఏపీ అసెంబ్లీ సాక్షిగా కొత్త కాక మొద‌ల‌యిన‌ట్టే భావించాలి. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాల‌కు ద్వైవార్షిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈసారి ఏకంగా […]

రాజకీయం
cbn
బాబు కి మింగుప‌డ‌ని నేత‌లు..!

విప‌క్ష నేత‌లు ఎలానూ పాల‌క‌పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డానికి చూస్తుంటారు. అందుకే త‌ప్పుల‌ను ఎప్పటిక‌ప్పుడు ఎండ‌గ‌డుతూ ఉంటారు. ప్ర‌జ‌ల్లో నిల‌దీస్తూ ఉంటారు. ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు అదే తీరు పాల‌క‌నేత‌ల్లోనూ క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ విధానాల‌ను , ప్ర‌భుత్వాధినేత వ్య‌వ‌హార‌శైలిని టీడీపీ నేత‌లు కూడా త‌ప్పుబ‌డుతున్నారు. కొంద‌రు నేరుగా విమ‌ర్శ‌లు చేస్తుంటే..మ‌రికొంద‌రు ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు అనుచ‌రులు ముందు..మ‌రికొంద‌రు ఆఫ్ ది రికార్డ్ లో చంద్ర‌బాబు శైలిని విమ‌ర్శిస్తున్నారు. అనేక‌కార‌ణాలున్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు పాల‌క‌ప‌క్ష […]

రాజకీయం
jagan-mohan-reddy-parliament-240
బాబు త‌ప్పిదాలే జ‌గ‌న్ రిపీట్ చేస్తారా..!?

అడిగిన వాళ్ల‌కు, అడ‌గ‌ని వాళ్ల‌కు హామీలిచ్చేశారు. అవ‌స‌రం ఉన్నా..లేకున్నా మాట ఇచ్చేశారు. సాధార‌ణ జ‌నాల‌కే కాదు ..త‌న తోటి నేత‌ల‌కు, ప‌క్క పార్టీ నాయ‌కుల‌కు కూడా చంద్ర‌బాబు అదే చెప్పారు. ఆయ‌న మాట న‌మ్మి అనేక‌మంది సైకిలెక్కారు. అందుకే అప్పుడు చెప్పిన హామీలు అమ‌లుచేయ‌మంటూ ఇప్పుడు మొండికేస్తున్నారు. చెప్పిన మాట‌లు నెర‌వేర్చ‌క‌పోతే మాకు న‌చ్చింది చేసుకుంటామంటూ ప‌లువురు చెప్పేస్తున్నారు. దాంతో ఈ ప‌రిణామాలు చంద్ర‌బాబుకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. సామాన్య‌జ‌నంలోనే కాదు బ‌డా నేత‌ల్లోనూ హామీల అమ‌లు అస‌లు […]

రాజకీయం
Chandra-babu-naidu-with-modi
చంద్ర‌బాబు క‌ష్టాలు రెట్టింపు చేస్తున్న మోడీ..!

పాపం చంద్ర‌బాబు ప్ర‌పంచ‌మంతా తిరిగివ‌స్తున్నారు గానీ హ‌స్తిన‌లో హ‌వా ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నారు. తానెప్పుడో చ‌క్రం తిప్పాన‌ని, ప్ర‌ధాన‌మంత్రుల‌ను కూడా నియ‌మించాన‌ని చెప్పుకునే ఏపీ సీఎంకి ఇప్ప‌టి పీఎం మాత్రం మింగుడుప‌డ‌డం లేదు. దాంతో ఆయ‌న స‌మ‌స్య‌లు వ‌ర్ణ‌నాతీతం. ఇప్ప‌టికే ఉన్న స‌మ‌స్య‌ల‌కు తోడు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్న మోడీ తీరుతో బాబుకి బేజారెత్తిపోతోంది. అయినా ప‌ల్లెత్తుమాట అన‌లేని ప‌రిస్థితి ఉండ‌డంతో ఆయ‌న క‌క్కాలేక మింగాలేక అన్న చందంగా మారిపోతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని బీజేపీ వెంక‌య్య తెర‌మీద‌కు […]

రాజకీయం
kannalakshminarayana1457277339
క‌న్నాకు లైన్ క్లియ‌ర్..!

వైఎస్సార్సీపీలో చేర‌డానికి ఒక్కొక్క‌రుగా నేత‌లు వ‌రుస‌గా ముందుకొస్తున్నారు. లైన్ క్లియ‌ర్ చేసుకుని గోడ‌దూకేస్తున్నారు. ముఖ్యంగా పాల‌క‌ప‌క్షాలు బీజేపీ, టీడీపీ నుంచి కూడా ప‌లువురు సీనియ‌ర్లు వైఎస్సార్సీపీలో చేరుతుండ‌డం విశేషం. వేస‌వికి ముందే ఫ్యాన్ పంచ‌న చేరిపోవాల‌ని ఆలోచిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డం ఆస‌క్తిదాయ‌కం. తాజాగా ఆ జాబితాలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ చేరిపోతున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న వైఎస్సార్సీపీలో చేర‌డం నూటికి 90శాతం గ్యారంటీ అని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ముఖ్యంగా బీజేపీ […]

రాజకీయం
jagancbn
జ‌గ‌న్ శిబిరంలో ఎన్ని మార్పులో ?

స‌రిగ్గా గ‌త ఏడాది ఇదే స‌మ‌యానికి రాయ‌ల‌సీమ‌కు చెందిన కీల‌క‌నేత‌లంతా క్యూ క‌ట్టేశారు. వైఎస్సార్సీపీని వీడిపోవ‌డం మొద‌లెట్టారు. జ‌గ‌న్ కి స‌న్నిహితులుగా మెలిగిన నేత‌లే హ్యాండిచ్చే ప‌రిస్థితి క‌నిపించింది. ఒకే రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క‌లిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఒక్క‌సారిగా విప‌క్షంలో క‌ల‌క‌లం. పార్టీ చీల‌బోతున్న‌ట్టు అధికార‌ప‌క్షం దాడి. దాంతో జ‌గ‌న్ కి కూడా ఎటూ పాలుపోని ప‌రిస్థితి. పార్టీలో ఏం జ‌రుగుతుంద‌నే సందిగ్ధం. ఆపార్టీ శ్రేణుల‌ను తీవ్రంగా వేధించింది. అదే స‌మ‌యంలో […]

రాజకీయం
Jagan-Mohan-Reddy
లెట్స్ డూ ‘క‌మ్మ‌’డూ అంటున్న జ‌గ‌న్..!

అవున‌న్నా..కాద‌న్నా ఏపీ నిండా కులాల కుంప‌ట్లే. కుల రాజ‌కీయాలే ఇక్క‌డ శాస‌నం. కులాల వారీగా విభ‌జ‌న‌లు కూడా సాధ్య‌మే. అందులోనూ ఆర్థికంగా బ‌ల‌మైన కులాల ఆధిప‌త్య పోరు అనునిత్యం సుస్ప‌ష్ట‌మిక్క‌డ‌. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్పుడు రెడ్లు, క‌మ్మ‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగితే ఇప్పుడు విభ‌జ‌న త‌ర్వాత కాపులు కూడా త‌మ వాటా కోసం ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. కానీ కాపు సామాజిక‌వ‌ర్గాన్ని డిప్యూటీ సీఎం ప‌ద‌వితో సంతృప్తిపరుస్తూ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం సుదీర్ఘ‌కాలం […]

రాజకీయం
pawan
జ‌న‌సేనకు మ‌రో ఛాన్స్ ..!

ఎప్పుడైనా రాజ‌కీయాల్లో పాల‌కప‌క్షాన్ని ప్ర‌జ‌లు స‌హించ‌లేన‌ప్పుడు ..అదే స‌మ‌యంలో విప‌క్షం ఏమాత్రం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వినియోగించుకోలేని ద‌శ‌లో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కొత్త పార్టీలు మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతాయి. అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు ఉందా అన్న ప్ర‌శ్న ప‌క్క‌న పెడితే జ‌న‌సేన పార్టీ ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశిస్తున్న ఫ‌లితాలు వ‌స్తాయా అన్న‌ది చాలామందిలో ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. గ‌తంలో ప్ర‌జారాజ్యం అనుభవాలు కూడా ఉండ‌డంతో అంద‌రూ దానినే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు అయితే ప‌వ‌న్ మాత్రం గెలుపోట‌ములు కాకుండా ప్ర‌శ్నించ‌డం కోస‌మే […]