Category: న్యూస్ తెలంగాణ

న్యూస్ తెలంగాణ
ap-assembly_0
తెలంగాణా అసెంబ్లీ 8 నుంచి

తెలంగాణా శాసనసభ, మండలి సమావేశాలు మార్చి 8న ప్రారంభం కాను న్నాయి. 10న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించా రు. ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశిం చారు. బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ నరసింహన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 9న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. మరుసటి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల కోసం వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనల […]

న్యూస్ తెలంగాణ
telangana
తెలంగాణాలో అరెస్టుల ప‌ర్వం

నిరుద్యోగుల ర్యాలీని అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న ప్ర‌భుత్వం జేఏసీ నేత‌ల‌ను అరెస్టులు సాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టులు చేస్తున్నారు. హైద‌రాబాద్ లో భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. ఇందిరాపార్క్ స‌మీపంలోని అన్ని ప్రాంతాల‌ను త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ర్యాలీ సాగ‌నివ్వ‌మంటూ చెప్పిన ప్ర‌భుత్వం దానికి త‌గ్గ‌ట్టుగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్ ను అరెస్ట్ చేసింది. నిరుద్యోగుల నిరసన ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో అర్థరాత్రి దాటిన […]

న్యూస్ తెలంగాణ
kodanda
కేసీఆర్ తీరుపై కోదండ‌రామ్ పైర్

తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం నిప్పులు చెరిగారు. ఎవరిని అవమానిస్తున్నారో అనే విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించాలని అనుకుంటే అడుగడుగునా ఆంక్షలుపెట్టి అప్పుడే సమైక్యపాలనను తలపించే వాతావరణం సృష్టించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రనే నేర చరిత్రగా, హింసాత్మక చరిత్రగా పోలీసులు అభివర్ణించడం దారుణమైన అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిరుద్యోగ నిరసన ర్యాలీకి తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, […]

న్యూస్ తెలంగాణ
kcr
ఏపీకి తెలంగాణా సీఎం

వేంకటేశ్వరునికి తెలంగాణ మొక్కులను తీర్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న తిరుమలకు బయల్దేరనున్నారు. కుటుంబీకులు, కొందరు మంత్రులతో కలసి ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం సీఎం తిరుపతి పర్యటనకు బయల్దేరుతారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూలు ప్రకారం మంగళ వారం సాయంత్రం సీఎం తిరుపతి చేరుకుంటారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. 22న ఉదయాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సీఎం సమర్పిస్తారు. […]

న్యూస్ తెలంగాణ
Mohammed-Ali-Shabbir
స‌మంత గురించి కేటీఆర్ ని ప్ర‌శ్నించిన ఎమ్మెల్సీ

సినీ హీరో నాగార్జునతో ఉన్న లావాదేవీల వల్లే చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరోయిన్ సమంతను నియమించారని మంత్రి కేటీఆర్‌‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో మంత్రి కేటీఆర్‌ ఓ బచ్చా అని షబ్బీర్‌అలీ అన్నారు. అనంతరం ఆయన రాష్ట్రంలో వైద్య విధానంపై కూడా మాట్లాడారు. తెలంగాణలో వైద్యం పడకేసిందని, తక్షణమే హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని షబ్బరీ అలీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్య పరిస్థితిపై గవర్నర్‌ […]

న్యూస్ తెలంగాణ
UTTAM
కాంగ్రెస్ కి 55 సీట్లు

2019 అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 55 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్న ఆశాభావంతో టిపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఉత్తమ్‌ చెప్పిన ఈ విషయాలు డీలాపడ్డ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

న్యూస్ తెలంగాణ
kodanda
కోదండ‌రామ్ సొంత పార్టీ ఖాయం

టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను కూడగట్టి రాజకీయ పార్టీగా అవతరించేందుకు కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి ప్రయత్నాలు సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఒక రాజకీయ పార్టీగా రూపుదాల్చాలి అనేది జెఎసి ప్రణాళిక. దీనికి తగ్గట్టుగా శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ముసుగులో గుద్దులాట కన్నా కోదండరామ్ రాజకీయ పార్టీ ఏర్పాటును స్వాగతిస్తామని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ‘కోదండరామ్ రాజకీయ పార్టీ ఆలోచనలపై మొదటి నుంచి మాకు […]

న్యూస్ తెలంగాణ
janasena
క‌విత‌కు ప‌వ‌న్ థాంక్స్..!

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటులో పాల్గొన్న కవిత.. అక్కడ మాట్లాడుతూ ‘జై తెలంగాణ.. జై ఆంధ్రప్రదేశ్’ అని నినదించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న పవన్… ట్విట్టర్ ద్వారా ఎంపీ కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ, ఏపీ కలిసి పనిచేస్తే ఇరు రాష్ట్రాల్లోని ప్రజా సమస్యలకు సులభంగా […]

న్యూస్ తెలంగాణ
kavitha
హోదా ఇవ్వాలంటున్న క‌విత‌

’ప్రజలు కోరుకుంటున్న వాటిని అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్ర ప్రజలకు మేము అండగా ఉంటాము. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారిగా కలిసి ఉండాలి’ నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనడానికి విజయవాడకు చేరకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

న్యూస్ తెలంగాణ
Hyderabad_High_Court
మంత్రి కొడుకుపై హైకోర్ట్ లో ఫిర్యాదు

ఆదిలాబాద్‌ జిల్లా జైనాథ్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కె. తిరుపతి రెడ్డి హత్యకేసులో అటవీశాఖ మంత్రి జోగురామన్న కుమారుడు జోగు ప్రేమేందర్‌ హస్తం ఉందని ఆరోపిస్తూ ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుతూ మృతుని కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. రామలింగేశ్వరరావు విచారించారు. పిటిషనర్ల తరఫున్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ, కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లను పోలీసు స్టేషన్‌కు పిలిచి విచారణ […]