Category: న్యూస్ ఆంధ్రా

న్యూస్ ఆంధ్రా
nara lokesh
జ‌గ‌న్ కి లోకేష్ స‌వాల్..!

“జగన్ కు 24 గంటల టైమిచ్చి మరీ సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. మీకిలా సవాల్ విసరడం మూడోసారి. ఆధారాలు చూపించమంటే పారిపోతారెందుకు? మళ్ళీ అడుగుతున్నా, బహిరంగ చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన అందరూ నీలా ప్రజల సొమ్ముదోచుకుంటారా? నీ పచ్చ కామెర్ల కంటితో చూసి ఆరోపణలు చేయకు. మాది కీర్తి సంపాదన. నీది అవినీతి సంపాదన”…ఇదీ నారా లోకేష్ ట్విట్ట‌ర్ కామెంట్స్. తాజాగా విశాఖ భూక‌బ్జాల‌పై ఆందోళ‌న సంద‌ర్భంగా జ‌గ‌న్ […]

న్యూస్ ఆంధ్రా
iyr krishnrao
టీడీపీలో బ్రాహ్మ‌ణ లొల్లి..!

ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారుకి స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఇప్ప‌టికే అనేక‌వ‌ర్గాలు దూర‌మ‌వుతుండ‌గా తాజాగా బాబు వ్య‌వ‌హారంతో బ్రాహ్మ‌ణులు కూడా క‌ల‌త చెందే ప‌రిస్థితి వ‌చ్చేసింది. చంద్ర‌బాబు తీరుతో అసంతృప్తిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు పై సీనియ‌ర్ అధికారి అనే గౌర‌వం కూడా లేకుండా అనూహ్యంగా వేటు వేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ నుంచి ఆయ‌న్ని తొల‌గించ‌డం వివాదంగా మారుతోంది. బ్రాహ్మ‌ణ వ‌ర్గాల్లో నిర‌స‌న‌ల‌కు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ […]

న్యూస్ ఆంధ్రా
19225778_10213388402094860_8898799616948943078_n
ఓ అడుగు ముందే వైసీపీ..!

రాజ‌కీయాల్లో తానే సీనియ‌ర్ న‌ని చెప్పుకునే చంద్ర‌బాబుకే అంతుబ‌ట్ట‌ని రీతిలో వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజా రాజ‌కీయాల్లో జాతీయ స్థాయిలో బాబుని మించిన రీతిలో వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీలో వెంక‌య్య త‌ప్ప మ‌రో అవ‌కాశ‌మే లేకపోవ‌డ‌తో బాబు అన్నింటికీ ఆ సీనియ‌ర్ బీజేపీ నేత మీద ఆధార‌ప‌డాల్సి వ‌స్తుండ‌గా వైసీపీ త‌రుపున విజ‌యసాయిరెడ్డి చ‌క్రం తిప్పేస్తున్నారు. పార్ల‌మెంట్ లో అడుగుపెట్టి పూర్తిగా రెండేళ్ల‌యినా కాక‌ముందు నుంచే విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హార‌దక్ష‌త ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు టీడీపీ […]

న్యూస్ ఆంధ్రా
TDPFlag
టీడీపీ కొత్త అధ్య‌క్షులు

టీడీపీ జిల్లా విభాగాలకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆయన ప్రకటించిన జాబితా ప్రకారం.. శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-చిన్నమనాయుడు, విశాఖ అర్బన్‌- వాసుపల్లి గణేష్‌, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేశ్‌బాబు, తూర్పుగోదావరి-నామన రాంబాబు, పశ్చిమ గోదావరి-తోట సీతారామలక్ష్మి, కృష్ణా-బచ్చుల అర్జునుడు, గుంటూరు-జీవీఎస్‌ ఆంజనేయులు, ప్రకాశం-దామచర్ల జనార్దన్‌, నెల్లూరు-బీద రవిచంద్రయాదవ్‌, చిత్తూరు-వెంకటమణి ప్రసాద్‌, కడప-శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు-సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అనంతపురం-బీకే పార్థసారథి కొత్త అధ్యక్షులుగా నియమితులయ్యారు.

న్యూస్ ఆంధ్రా
jc diwakar
జేసీ అబ‌ద్ధం చెప్పారంటున్న కేంద్ర‌మంత్రి

పౌర‌విమాన‌యాన మంత్రి పెద‌వి విప్పారు. స‌హ‌చ‌ర టీడీపీ ఎంపీ తీరును త‌ప్పుబ‌ట్టారు. జేసీ దివాక‌ర్ రెడ్డి అబ‌ద్ధం చెప్పారంటూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు వివ‌రించారు. విశాఖ ఎయిర్ పోర్టులో వీరంగం చేసిన అనంత‌పురం ఎంపీ తీరుపై స్పందించిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు, విశాఖ ఎయిర్‌పోర్టుకు గంట ముందు వచ్చినట్లు జేసీ చెప్పారని, కానీ సీసీ టీవీ ఫుటేజ్‌లో అది అవాస్తవమని తేలిందని అశోక్ గజపతి రాజు వివరించారు. అంత‌టితో స‌రిపెట్టకుండా త‌మ శాఖ త‌రుపున ప్ర‌యాణీకుల‌కు సేవ‌లందించ‌డ‌మే త‌ప్ప‌, ఇలాంటి […]

న్యూస్ ఆంధ్రా
diwakar-reddy_650x400_81497536295
జేసీ పై వేటు ప‌డింది..!

విమానయాన సంస్థ‌ల్లో టీడీపీ ఎంపీ మీద వేటు ప‌డింది. ఈ విష‌యంలో శివ‌సేన త‌ర్వాతి స్థానం టీడీపీ ద‌క్కించుకుంది. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఝులుం మీద ప‌లు సంస్థ‌లు క‌న్నెర్ర చేశాయి. త‌మ విమానాల్లో ఆయ‌న‌కు చోటు క‌ల్పించ‌మ‌ని ప్ర‌క‌టించాయి. ప‌లువురు పెద్ద‌లు రంగంలో దిగి లాబీయింగ్ చేసినా సిబ్బంది మీద దాడికి పాల్ప‌డిన నేత‌ను సంస్థ‌లు క్ష‌మించ‌లేదు. దాంతో జేసీ మీద ఎయిర్ లైన్ బ్యాన్ విధించారు. తమ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి నందుకు జేసీని […]

న్యూస్ ఆంధ్రా
jagan
జ‌గ‌న్ కూతురికి లండ‌న్ లో సీటు

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి కుటుంబం ఆనందంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ఇంట ఆనందానికి ఆయ‌న కుమార్తె సాధించిన ఘ‌న‌తే కార‌ణం. స‌హ‌జంగా ప్ర‌చారానికి ఆమ‌డ దూరంగా ఉండే జ‌గ‌న్ కుటుంబంలో ఇప్పుడు పెద్ద‌ కూతురు వ‌ర్ష సాధించిన విజ‌యంతో వారు ఉప్పొంగిపోతున్నారు. ఏకంగా లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో వ‌ర్ష సీటు సాధించ‌డంతో వారంతా సంబ‌ర‌ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ కి ఇద్ద‌రు వార‌సురాళ్లున్నారు. వర్ష, హర్ష అనే ఇద్ద‌రు కుమార్తెలు బ‌య‌ట ప్ర‌పంచానికి పెద్ద‌గా ప‌రిచ‌య‌స్తులు కారు. […]

న్యూస్ ఆంధ్రా
chevireddy
వాళ్ల‌ను వ‌దిలేది లేదంటున్న చెవిరెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఉద్యోగుల తీరుపై మండిప‌డ్డారు. త‌న క్ష‌మాప‌ణ‌లు కోరిన ఉద్యోగ సంఘాల నేత‌ల వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఉద్యోగ నేత‌ల‌కు ద‌మ్ముంటే త‌ప్పుడు ప‌నుల‌కు పాల్ప‌డుతున్న ఉద్యోగుల సంగ‌తి చూడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. ఉద్యోగుల అక్ర‌మాల‌పై గ్రీవెన్స్ నిర్వ‌హించ‌గ‌ల స‌త్తా ఉందా అని ప్ర‌శ్నించారు. ఉద్యోగుల అక్ర‌మాల‌పై పోరాటం సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ప‌సుపు చొక్కాలు వేసుకున్న ఉద్యోగుల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ని ఉద్యోగుల విష‌యంలో […]

న్యూస్ ఆంధ్రా
Chandrababu_Naidu_Close_Up_3x2 (Facebook - Andhra Pradesh CM)
కాపుల‌కు మ‌ళ్లీ కామా పెడుతున్నారు..!

స‌మ‌స్య ప‌రిష్క‌రించేలా ఫుల్ స్టాప్ పెడ‌తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు మ‌రోసారి మెలిక ప‌ట్టారు. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం క‌ప్ప‌దాటు వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగా రిజ‌ర్వేష‌న్ల అంశం మీద నియ‌మించిన మంజునాథ క‌మిష‌న్ రిపోర్ట్ లో జాప్యం జ‌రుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. బీసీల‌కు, కాపుల‌కు స‌మానంగా న్యాయం జ‌రిగేలా చేస్తానంటున్న చంద్ర‌బాబు కాల‌యాప‌న వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే తాజాగా డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప ప్ర‌క‌ట‌న క‌నిపిస్తోంది. 2016 ఆగ‌ష్ట్ లో […]

న్యూస్ ఆంధ్రా
chevireddy
వైసీపి ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ను వేధిస్తున్న వారిపై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. తాము అధికారంలోకి రాబోతున్నామ‌న్న ధీమాను వ్య‌క్తం చేసిన ఆయ‌న ఉద్యోగుల‌నుద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. రాబోయే ఏడాదిన్న‌ర‌లో మేము అధికారంలోకి వ‌స్తామంటూ చెవిరెడ్డి దీమా వ్య‌క్తం చేశారు. అంత‌టితో స‌రిపెట్టకుంటా అదికారంలోకి రాగేనే త‌ప్పు చేసిన అధికారుల‌ను వెంటాడుతామ‌న్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన అధికారుల‌ను […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter