Category: న్యూస్

న్యూస్ ఆంధ్రా
ap assembly
లీకేజీ ఓ కుట్ర‌

పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం దుష్ప్ర‌చారం అని మంత్రి గంటా శ్రీనివాస‌రావు వ్యాఖ్యానించారు. ప‌రీక్ష కు ముందు పేప‌ర్ లీక్ అయితేనే లీకేజీ కింద భావించాల‌న్నారు. ప‌రీక్ష ప్రారంభ‌మ‌యిన త‌ర్వాత పేప‌ర్ బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణ‌మైన అటెండ‌ర్ పై చ‌ర్య‌లు తీసుకుంటాన్న‌మ‌న్నారు. నివేదిక వ‌చ్చిన బాధ్యులంద‌రి మీద చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని చెప్పారు. కానీ విప‌క్షం దానిని రాజ‌కీయం చేస్తూ దుష్ప్ర‌చారం సాగుతోంద‌న్నారు. మ‌రోవైపు నారాయ‌ణ కూడా త‌న సంస్థ‌ల మీద కుట్ర జ‌రుగుతోంద‌ని విమ‌ర్శించారు. విప‌క్షం రాజ‌కీయంగా డ్రామాలాడుతోంద‌న్నారు. […]

న్యూస్ ఆంధ్రా
ap assembly
నారాయ‌ణ లీకేజీల‌పై ద‌ద్ద‌రిల్లిన అసెంబ్లీ

ఏపీలో ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం స‌భ‌లో దుమారం రేపింది. అసెంబ్లీలో విప‌క్షం ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌య్యింది. ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారంలో వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంతో స‌భ దద్ద‌రిల్లింది. స్పీక‌ర్ కోడెల వాయిదా తీర్మానాన్ని తిర‌స్క‌రించ‌డంతో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. పోడియంలోకి దూసుకొచ్చారు. నినాదాలు చేశారు. దాంతో స‌భ ప‌ది నిమిషాలు వాయిదా వేస్తున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. అయితే ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని అడ్డుకుంటున్నారంటూ ఆరోపించింది. విప‌క్ష స‌భ్యులు మాత్రం ప్ర‌భుత్వం […]

న్యూస్ ఆంధ్రా
somu veerraju
ఆ రెండు జిల్లాల‌ను విభ‌జించాలి

ఏపీలో పెద్ద జిల్లాల‌ను విభ‌జించాల‌ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి, అనంత‌పురం పెద్ద జిల్లాలుగా ఉన్నాయ‌న్నారు. వాటి విభ‌జ‌న కోసం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు. దానికోసం ఓ క‌మిటీ ఏర్పాటు జ‌రుగుతోంద‌న్నారు. అదే క్ర‌మంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆయ‌న మాట మార్చేశారు. ఏపీలో టీడీపీ-బీజేపీ క‌లిసి ప‌నిచేస్తాయ‌న్నారు. ఇటీవ‌ల త‌న వ్యాఖ్య‌లు వ‌క్రీక‌రించార‌ని తెలిపారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపు రెండు పార్టీల వ‌ల్లే వ‌చ్చింద‌ని […]

న్యూస్ ఆంధ్రా
kalva srinivasulu
జ‌గ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్లే స‌భ ప్ర‌శాంతం..!

ఏపీ అసెంబ్లీ లాబీల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చర్చ సాగింది. విప‌క్ష నేత మీద చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సెటైర్లు విసిరారు. విప‌క్ష నేత అసెంబ్లీకి హాజ‌రుకాక‌పోవ‌డం వ‌ల్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కూడా స్పందించారు. స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత లేక‌పోవ‌డంతో చ‌ర్చ‌లు ప్రశాతంగా సాగాయ‌ని కాల్వ వ్యాఖ్యానించారు. గొడ‌వ‌లు చేయాల‌ని ఎమ్మెల్యేల మీద జ‌గ‌న్ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆయ‌న వ్యాఖ్యానించ‌డంతో కోటంరెడ్డి స్పందించారు. మాట్లాడ‌డానికి రెండు […]

న్యూస్ తెలంగాణ
revanth reddy
మీకు హిమాన్ష్..మాకు దేవాన్ష్

అసెంబ్లీలో లాబీల్లో మ‌రోసారి ఆస‌క్తిక‌ర అంశం ముందుకొచ్చింది. ముఖ్య‌మంత్రుల మ‌న‌వ‌ళ్ల మీద నేత‌లు మాట్లాడుకోవ‌డం ఆస‌క్తిగా క‌నిపించింది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సస్పెండ్‌ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అసెంబ్లీకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ఆయనతో ‘ సస్పెండైన మిమ్మల్ని ఎలా రానిచ్చారన్నా’ అని అడిగారు. దీనికి రేవంత్‌ బదులిస్తూ.. ‘ హిమాన్షు.. వాళ్ల తాత […]

న్యూస్ తెలంగాణ
miisters on telangana ap issues
బాబు తో చ‌ర్చించి చెబుతామ‌న్న ఏపీ మంత్రులు

చంద్రబాబు నాయుడుతో చర్చించాకే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ స్పష్టంచేసింది. ఇప్పటికీ హైదరాబాద్‌ నుంచి కొన్ని విభాగాలు పని చేస్తున్నాయని, ముఖ్యమైన ఫైళ్ళు, ఇతర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గవర్నర్‌కు తెలిపారు. రాజ్‌భవన్‌లో ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీలు మూడో విడత సమావేశమయ్యాయి. ఏపీ తరుపున మంత్రులు యనమల రామకృష్ణ, అచ్చెన్నాయుడు, చీఫ్‌ విప్‌ […]

న్యూస్ ఆంధ్రా
roja
రాజ‌శేఖ‌ర్ రెడ్డి అలా అనుకుని ఉంటే..!

ఇప్పుడు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన రీతిలో క‌క్ష సాధించే ధోర‌ణి వైఎస్ లో ఉంటే ఇప్పుడు టీడీపీలో నేత‌లెవ‌రూ మిగిలేవారు కాదని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చివ‌ర‌కు బాల‌య్య ఇంట్లో జ‌రిగిన వ్య‌వ‌హారం చంద్ర‌బాబు పాల‌న‌లో అయితే ఆయ‌న్ని కూడా ఇరికించేవార‌ని వ్యాఖ్యానించారు. కానీ కేంద్రంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబుని ఎందుకు గౌర‌వించాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. రుణ‌మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌ను, నిరుద్యోగ భృతి […]

న్యూస్ తెలంగాణ
kodanda
కోదండరాం అరెస్ట్‌

ధర్నాచౌక్‌ తరలించాలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 2కే రన్‌లో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధర్నాచౌక్‌ తరలింపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 2కే రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. పెద్ద ఎత్తున పోలీసుల మొహరింపుతో ఆ ప్రాంతం […]

న్యూస్ తెలంగాణ
naralokesh31454909222
లోకేష్ వారిని వ‌దిలేశారా..!?

ఏపీలో అధికారం కోసం అర్రులు చాస్తున్న చిన‌బాబు త‌న స‌న్నిహితుల‌ను విస్మ‌రించేశారు. త‌న‌ను న‌మ్ముకున్న వారి ఆశ‌ల‌ను వ‌మ్ము చేసేసిన‌ట్టు క‌నిపిస్తోంది. నాన్న అటు పోయినా..నేను మాత్రం ఇక్క‌డే ఉండి మీకు తోడుగా ఉంటాన‌ని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలంగాణా టీడీపీ నేత‌ల‌కు ఇచ్చిన హామీని తుంగ‌లో తొక్కేశారు. నాన్న వెంటే అబ్బాయ్ కూడ అమ‌రావ‌తి బాట ప‌ట్టేశారు. తెలంగాణా వ్య‌వ‌హారాల కోస‌మే నారా లోకేష్ కి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి […]

న్యూస్ ఆంధ్రా
chandrababu amaravat
అమరావ‌తి డిజైన్ల‌లో అన్నీ సందేహాలే

నార్మ‌న్ ఫోస్ట‌ర్ రాజ‌ధాని డిజైన్ల పై ఎమ్మెల్యేలు పెద‌వి విరిచారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు డిజైన్లు తీసుకొచ్చి , వాటిని ప‌క్క‌న పెట్టేసిన నేప‌థ్యంలో తాజా డిజైన్ల‌తో ఎప్పుడు నిర్మాణం జ‌రుగుతుంద‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో డిజైన్ల ప్ర‌జెంటేష‌న్ సాగించారు. దాని మీద ఎమ్మెల్యేలు ప‌లు భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా 900 ఎక‌రాల విస్తీర్ణంలో రాబోతున్న ఈ నిర్మాణాల‌కు సంబంధించి స్ప‌ష్ట‌త లేద‌ని అంటున్నారు. మ‌రోసారి మ‌భ్య‌పెట్ట‌డానికేనా అంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఇప్ప‌టికే […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter