Category: గోదావరి జిల్లాలు

గోదావరి జిల్లాలు
vatti vasantha
వ‌ట్టి రూటు మార్చేస్తున్నారు..!

ఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా వ‌ట్టి వ‌సంత‌కుమార్ కి ఒక‌ప్పుడు మంచి పేరు ఉండేది. అటు ప‌శ్చిమ గోదావ‌రి నుంచి విశాఖ జిల్లా వ‌ర‌కూ ఆయ‌నదే హ‌వా. అలాంటి నాయ‌కుడు హ‌ఠాత్తుగా తెర‌మ‌రుగైపోయారు. సొంత పార్టీలోనూ సైలెంట్ అయిపోయారు. సొంత జిల్లాలోనూ నోరు మెదిపిన దాఖ‌లాలు లేవు. దాంతో వ‌ట్టి రూటు మారుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌యిపోతోంది. వ‌ట్టి వసంత‌కుమార్ కూడా ఒక‌నాటి త‌న రాజ‌కీయ ఆరాధ్యుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యుడి గూటికి చేర‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం […]

గోదావరి జిల్లాలు
janasena
సైకిల్ తో జ‌న‌సేన స‌ఖ్య‌త సాధ్యం కాదా..!?

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఆ దిశ‌లో ఉన్నాయి. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గ‌ద్దెమీద కూర్చోవడానికి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీకి కూడా దూరం కావ‌డం ఖాయ‌మ‌ని అనిపిస్తోంది. ఇప్ప‌టికే బీజేపీతో జ‌న‌సేన బంధం దాదాపు తెగిపోయింది. ఇక టీడీపీతో కూడా స‌ఖ్య‌త క‌నిపించే అవ‌కాశాలు కాన‌రావ‌డం లేదు. ఇటీవ‌ల అనేక‌మంది టీడీపీ నేత‌లు జ‌న‌సేన మీద చేస్తున్న వ్యాఖ్య‌లు , ప‌వ‌న్ మీద గురిపెడుతున్న విమ‌ర్శ‌లు గ‌మ‌నిస్తే అదే వాస్త‌వం అనిపిస్తోంది. […]

గోదావరి జిల్లాలు
chinthamaneni
చింత‌మ‌నేనిపై కేసు న‌మోదు

జర్నలిస్టుపై దాడి ఘటనలో ప్రభుత్వ విప్‌, దెందులూరు ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌, ఆయన అనుచరులపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కొట్టడం, ఈడ్చుకెళ్లడం వంటి అంశాల ఆధారంగా 384, 323, 505 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులపై దురుసుగా ప్రవర్తించడాన్ని చిత్రీకరిస్తున్న 99 టివి చానల్‌ విలేకరి సాగర్‌పై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులంతా ఆందోళన […]

గోదావరి జిల్లాలు
15585358_1196987110337812_4684625829185201815_o
లోకేష్‌​ కాన్వాయ్‌ లో అపశ్రుతి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌​ కాన్వాయ్‌ లో అపశ్రుతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు సమీపంలో వేమగిరి వద్ద కాన్వాయ్‌లోని ఓ కారు ఢివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ఆ కారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాహనంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు కారు డ్రైవర్, గన్‌మెన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంత‌రం రాజ‌మండ్రిలోని […]

గోదావరి జిల్లాలు
1481522768.kandula-durgesh
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ అత‌డికే..!

వైఎస్సార్సీపీ త‌రుపున రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ స్థానం క‌న్ఫ‌ర్మ్ కావ‌డంతో కందుల దుర్గేష్ ప్ర‌తిప‌క్ష కండువా క‌ప్పుకున్నారు. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన ఆయ‌న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌తంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ అసెంబ్లీ సీటు ఆశించిన‌ప్ప‌టికీ అక్క‌డి నుంచి ఆకుల వీర్రాజును బ‌రిలో దింపిన జ‌గ‌న్ పార్టీ ప‌రాభ‌వం ఎదుర్కొంది. అయితే ఇప్పుడు మాత్రం వీర్రాజు స్థానంలో దుర్గేష్ బ‌ల‌మైన నాయ‌కుడిగా అంతా భావిస్తున్నారు. రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ప‌లు డివిజ‌న్లు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కార్పోరేష‌న్ […]

గోదావరి జిల్లాలు
kandula durgesh
జ‌గ‌న్ చెంత‌కు సీనియ‌ర్ నేత‌

సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ త్వ‌ర‌లో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దానికి ముహూర్తం సిద్ధం చేశారు. ఈనెల 12న వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. వైఎస్సార్సీపీని తూర్పు గోదావ‌రి జిల్లాలో బ‌లోపేతం చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా కాపుల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వంచించింద‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల‌కు రుణ‌మాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ అనేక ప్ర‌క‌ట‌న‌లు చేసి ఓట్లేయించుకున్న చంద్ర‌బాబు గ‌ద్దెనెక్కి మూడేళ్లు గ‌డుస్తున్నా హామీలు అమ‌లుకావ‌డం […]

గోదావరి జిల్లాలు
jagan ysrcp
మ‌న్యం పై జ‌గ‌న్ క‌న్ను

మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ కి అండ‌గా నిలిచిన గిరిజ‌నంపై జ‌గ‌న్ దృష్టి సారించారు. ఏజ‌న్సీలో ప‌ట్టు నిలుపుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని ఎస్టీ రిజ‌ర్వుడు స్థానాల‌న్నింటా ఒక్క ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం మిన‌హా వైఎస్సార్సీపీదే విజ‌యం అన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌భుత్వ విధానాల మూలంగా గిరిజ‌నులు టీడీపీకి మ‌రింత దూర‌మ‌వుతున్నార‌ని ప్ర‌తిప‌క్షం భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా రిజ‌ర్వుడు సీట్ల‌పై ఆయ‌న దృష్టి సారించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అందులో భాగంగా విశాఖ ఏజ‌న్సీలో బాక్సైట్ […]

గోదావరి జిల్లాలు
Cy5ROR3UcAIU9tD
ఆవిష్క‌ర‌ణ‌కు సిద్ధంగా ప‌వ‌న్ విగ్ర‌హం

విగ్ర‌హాల ఖాతాలో జ‌న‌సేనాని కూడా రెడీ అయిపోయారు. ఇప్ప‌టికే జీవించి ఉన్న ప‌లువురు నేత‌ల విగ్ర‌హాల‌ను పెట్ట‌డంలో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న అభిమానుల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా చేరిపోయారు. ఆపార్టీ అధినేత విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ప‌శ్చిమ గోదావరి జిల్లా తాడేప‌ల్లి గూడెంలో ప‌వ‌ర్ స్టార్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ విగ్ర‌హాం ఆవిష్క‌రిస్తామ‌ని అభిమానులు చెబుతున్నారు.

గోదావరి జిల్లాలు
15327408_1743335532658842_455979886654272072_n
పైస‌ల కోసం రోడ్డెక్క‌న అన్న‌దాత‌

బ్యాంకుల్లో డ‌బ్బుల్లున్నాయి. చేతిలో చిల్లిగ‌వ్వ లేదు..ప‌నులు సాగ‌డం లేదు. వ్య‌వ‌సాయం ఆగిపోతోంది. దాంతో అన్న‌దాత‌లు ఆగ్ర‌హం చెందారు. రోడ్డెక్కారు. మా బ్యాంకు సొమ్ము మాకెందుకు ఇవ్వరంటూ రోడ్డును బ్లాక్ చేశారు. రాస్తారోకో చేప‌ట్టారు. దాంతో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ల్ల‌జ‌ర్ల‌లో ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. నెట్ బ్యాంకింగ్ ..ఇత‌ర పేర్లు ఎన్నో చెబుతున్న నేత‌ల తీరును వారు తీవ్రంగా త‌ప్పుబ‌ట్ట‌డారు. రైతుల ఆగ్ర‌హంతో అధికారుల్లో అల‌జ‌డి రేగింది. బ్యాంకు ముందు పోలీసులు భారీ భద్ర‌త ఏర్పాటు చేశారు. అయితే […]

గోదావరి జిల్లాలు
polavaram project_0_0_0_0
పోల‌వ‌రం ప‌నులు వేగ‌వంతం

నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఏపీ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బంగారంపై పరిమితిని వ్యతిరేకించాలని సీఎంకు మంత్రులు సూచించారు.ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు మంత్రులు సూచించారు.నోట్ల రద్దుతో రాష్ట్రానికి రూ.800లకోట్లు ఆదాయం తగ్గిపోయిందని మంత్రి పల్లె ర‌ఘునాథ్ రెడ్డి మీడియాకు తెలిపారు . ఈ నెలాఖరుకు ఇది రూ.1500లకు చేరుతుందని కేబినెట్ అంచనా వేసిందన్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు..బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకూ మొత్తం […]

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter