జ‌గ‌న్ బినామీని కాదు..!

buses

“వైసీపీ అధినేత జగన్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు.. నేను జగన్ బినామిని కాదు” అని ప్రైవేట్‌ బస్‌ ఓనర్స్‌, ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ నేత సునీల్‌ క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తామన్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తెలుగురాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగు ప్రభుత్వాలు ట్రావెల్స్‌పై చట్టవ్యతిరేకంగా అవలంభిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.నిబంధనలకు లోబడే మేం బస్సులు నడుపుతున్నామన్నారు. ఒక వ్యక్తి ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గాయి.. ఏపీ ప్రభుత్వంపై త్వరలో కోర్టుకు వెళ్తామని సునీల్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలకు మేం సిద్ధమన్నారు. ఆర్టీసీకి మేం పోటీ కాదని సునీల్ తెలిపారు. అయితే ప్రభుత్వాలు ఓ వ్యక్తికి తలొగ్గాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra Pradesh, Telangana, Tollywood, Bollywood & Media News

Hyderabad, India
Call: +040 .........
Email: contact@updateap.com

Newsletter